పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ పాత్ర చాలా కీలకమైంది
పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ పాత్ర చాలా కీలకమైంది
- కవాతు ప్రాంగణం సెల్యూట్ బేస్ ఆవిష్కరణ
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
రామగుండం న్యూస్ ఫిబ్రవరి 7 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో నూతనంగా పున:రుద్దరణ చేసిన అర్ముడ్ అధికారుల కార్యాలయాలు,సిబ్బంది బ్యారక్,ఎం.టిఓ ఆఫీస్ వద్ద పోలీస్ వాహనాలు వాటర్ సర్వీస్ కోసం ఏర్పాటు చేసిన సర్వీసింగ్ పాయింట్ లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ప్రారంభించారు.ఆ ప్రారంభోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వచ్చిన పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కు పుష్పగుచ్చంతో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,ఏఆర్ ఏసీపీ ప్రతాప్,ఆర్ఐలు శుక్రవారం స్వాగతం పలికారు.అనంతరం నూతనంగా పున:రుద్దరణ చేసిన ఎం.టి.ఓ ఆఫీస్,ఆర్ఐ అడ్మిన్ ఆర్ ఐ హోం గార్డ్స్ ఆఫీస్,సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన నూతన బ్యారక్,బాత్ రూమ్స్, పరేడ్ గ్రౌండ్ లో సెల్యూట్ బేస్ ప్రాంగణాన్ని శిలాఫలకంతో ఆయన ప్రారంభించారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్,ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని సీపీ తెలిపారు.ఎన్నో సమస్యాత్మక పరిస్థితుల్లో,పండుగల బందోబస్తు,ఎన్నికల బందోబస్తు నిర్వహణ,గణేష్ నిమజ్జనం ఊరేగింపు వంటి విధుల నిర్వహణలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల కృషి ఎంతో ఉందని అభినందించారు.ఆరోజు కమీషనరేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నందు15 రోజుల పాటు సాగిన కమీషనరేట్ అర్మడ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపులో సిపి పాల్గొన్నారు.ముందుగా కమీషనరేట్ అర్మడ్ సిబ్బంది నుంచి సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.05 ప్లటూన్లతో ఏర్పాటు చేసిన ఈ పరేడ్ నకు ఆర్ ఐ అడ్మిన్ దామోదర్ ప్లటూన్ కమాండెర్ గా వ్యవహరించారు.ఆ పదిహేను రోజుల పాటు జరిగిన ఢీ - మొబిలైజేషన్ కార్యక్రమంలో ఇండోర్, ఔట్డోర్,ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొన్నారని ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్ సీపీకి వివరించారు. అలాగే సీపీ మాట్లాడుతూ..పోలీస్ అధికారులు,సిబ్బంది సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా మీకోసం నేనున్నానని తెలిపారు.పోలీసులు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం అలవాటు పడుతుందన్నారు.ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది మొత్తం ఒకే దగ్గరకు వచ్చి శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం మోబిలైజేషన్ ద్వారా కలుగుతుందన్నారు.ఆ పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని,భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.ఆ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందన్నారు.అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని తెలిపారు.నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందికి వ్యక్తిగత,కుటుంబపరమైన,శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు.ఆ డీ-మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమాన్ని సుందరంగా ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు.ఆ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్.,మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్.,అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు.,స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు,గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏ సి పి జానీ నరసింహులు,ఏ ఆర్ ఎస్ సి పి ప్రతాప్,ఏ ఓ శ్రీనివాస్, ఆర్ఐ దామోదర్, వామన మూర్తి, మల్లేశం,సంపత్, ఇన్స్పెక్టర్ లు, సీఐలు,సిపిఓ సిబ్బంది, వివిధ వింగ్స్ అధికారులు సిబ్బంది,ఏఆర్- స్పెషల్ పార్టీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment