కాంగ్రెస్,బిఆర్ఎస్ లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపిని ఓడగొట్టేందుకే కుట్రలు

కాంగ్రెస్,బిఆర్ఎస్ లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపిని ఓడగొట్టేందుకే కుట్రలు



--  బిజెపి నాయకులు రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 10 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : గత అధికారంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరుద్యోగులను మోసం చేశాయని భారతీయ జనతా పార్టీ నాయకులు వేరబెల్లి రఘునాథ్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు.ఆ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతను మరియు ఉపాధ్యాయులను మోసం చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత 14 నెలల నుండి యువతను, నిర్యుద్యోగ యువతను మరియు ఉపాధ్యాయులను మోసం చేస్తుందని విమర్శించారు.కాగా 6 గ్యారీటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను,కూలీ రైతులను,ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు అందించక పేద ప్రజలను మోసం చేయడమే గాక 2 లక్షల ఉద్యోగాలు,నిరుద్యోగ భృతి పేరుతో యువతను అన్ని వర్గాల ప్రజలను తప్పుదారి పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఆరోపించారు.అదేవిధంగా అటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు,పీఆర్సీ అందించకుండా ఇటు ఉద్యోగులను,ఉపాధ్యాయులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జి.ఓ 317 కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల తరపున పోరాటం చేసిన పార్టీ బిజెపి మాత్రమే అన్నారు. 317 జి.ఓపై పోరాడి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జైలుకు కూడా వెళ్లారన్నారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగ యువత పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఘనత బీజేపీ పార్టీదేన్నారు.ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు,నిరుద్యోగ యువతకు అండగా ఉండి వాళ్ల తరపున పోరాటం చేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేన్నారు.రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యి బీజేపీ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని వచ్చే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల కుట్రలను తిప్పికొట్టి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.అన్ని విధాలుగా పట్టభద్రులకు,నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయులకు బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.ఆ కార్యక్రమంలో భాజపా నాయకులు దుర్గం అశోక్,పత్తి వెంకట కృష్ణ,ఎనగందుల కృష్ణ మూర్తి,బియ్యాల సతీష్ రావు,పార్టీ నాయకురాలు జోగుల శ్రీదేవి,నాయకులు మాధవరపు వెంకట రమణ రావు,అమిరిశెట్టి రాజ్ కుమార్,సత్రం రమేష్,గడ్డం స్వామి రెడ్డి,కర్రె లచ్చన్న,బొద్దున మల్లేష్,గాదె శ్రీనివాస్,బింగి ప్రవీణ్,మెరెడిగొండ శ్రీనివాస్, మెట్టుపల్లి జయరామ రావు,కర్రె చక్రవర్తి,ఆర్నకొండ శ్రీనివాస్,రావణవేణి శ్రీనివాస్,నాగుల రాజన్న, దేవరకొండ వెంకన్న,కొండ వెంకటేష్,చిరంజీవి,చల్లా విక్రమ్,సదయ్య,దుర్గా ప్రసాద్,తరుణ్ సింగ్,కట్కూరి తిరుపతి,ఎల్కపల్లి పవన్,మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి