క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంచిర్యాల కలెక్టర్ ఆకస్మిక పర్యటన

క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంచిర్యాల కలెక్టర్ ఆకస్మిక పర్యటన

---  అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ కుమార్ ఆదేశాలు

---  జర్నలిస్టు తెలుగు దినపత్రిక ప్రెస్ అండ్ మీడియా న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 4 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచిర్యాల కలెక్టర్ -ప్రత్యేక అధికారి కుమార్ దీపక్(ఐఏఎస్) మంగళవారం ఏట్టకేలకు ఆకస్మికంగా ఆయన పర్యటించారు.కాగా కలెక్టర్ ఆకస్మిక సందర్శనలో వివిధ విభాగాల పనుల గురించి పట్టణ క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.







రాజును అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.దాంతో ఇంటి పన్నులు,ట్రేడ్ లైసెన్సులు 100 శాతం వసూలు చేయాలని తెలిపారు.అలాగే పట్టణంలోని ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వెల్లడించారు.అదేవిధంగా పారిశుద్ద్య పనులను మెరుగుపరచాలని ఆదేశించారు.అనంతరం పట్టణంలోని నర్సరీని సందర్శించారు.ఆ ప్రాంతంలో మొక్కల పెంపకము చేపట్టి పూర్తిచేయాలని సూచించారు. ఆ నేపథ్యంలోనే డంప్ యార్డు ను పరిశీలించి బయో మైనింగ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఆ తర్వాత అమృత్ 2.0 కు సంబంధించి నిర్మాణం(ఎస్ ఆర్ కె స్కూల్ ముందు,అమ్మ గార్డెన్ వెనుక ప్రాంతాలలో) చేపట్టిన సంబంధిత ఆ వాటర్ ట్యాంకుల నిర్మాణపు పనులు కూడా త్వరితగతిన త్వరగా పుర్తి చేయాలని ఆదేశించారు.ప్రధానంగా ప్రజలకు సమస్యలు తలెత్తకుండా నీటి సరఫరా సక్రమంగా సరపర చేయాలని ప్రకటించారు.ఆ కార్యక్రమంలో కుమార్ దీపక్ (ఐఏఎస్ మంచిర్యాల)జిల్లా కలెక్టర్ అండ్ ప్రత్యేకాధికారి,క్యాతనపల్లి జి. రాజు కమీషనర్,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి