మంచిర్యాలలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటన

మంచిర్యాలలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటన

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంచిర్యాల పట్టణంలోని తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి






రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి,సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి,రావుల రామనాథ్,చల్లా నారాయణ రెడ్డి పాల్గొన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్  మాట్లాడుతూ ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.బిజెపి అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ కుల గణన పేరుతో బీసీలను మోసం చేస్తుందని హిందువుల జనాభా తక్కువ చేసే చూపే ప్రయత్నం చేస్తుందని బీసీలు అందరూ ఏకం అయ్యి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి