కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయంపై ఆర్కేపిలో కాంగ్రెస్ నిరసన
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయంపై ఆర్కేపీలో కాంగ్రెస్ నిరసన
--- అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ
--- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 3 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు చెన్నూర్ ఎంఎల్ఏ వివేక్ వెంకటస్వామి ఆదేశాలు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,పీసీసీ కార్యదర్శి పిన్నాంటి రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకమార్లు ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను కలిసి లోటు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందించినట్లు గుర్తు చేశారు.కాగా అవేమీ పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆ బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు బల్లలు చరిచి తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వ్యవహరించినా ఆ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య,నాయకులు గాండ్ల సమ్మయ్య,మెట్ట సుధాకర్,పలిగిరి కనకరాజు,బత్తుల వేణు,బైరి మల్లేష్,సంగ రవి,మోకనపల్లి రామకృష్ణా,బోనగిరి రవీందర్,నల్లూరి రాజు,అమృత కుమారస్వామి,రోడ్డ రమేష్,బత్తుల శ్రీనివాస్,కనకం వెంకటేశ్వర్లు,కుర్మ సుగునకర్,బత్తిని రవి,మహిళ నాయకురాలు మాజీ చైర్ పర్సన్ జంకం కళ,సునీత,శారద,రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment