క్యాతనపల్లి సబ్ స్టేషన్ లో ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
క్యాతనపల్లి సబ్ స్టేషన్ లో ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
-- ముఖ్యఅతిథి ఎస్ఈ గంగాధర్ చేతుల మీదుగా ప్రారంభం..
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 6 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల శివాజీ నగర్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ లో అదనపు ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.ఆ క్రమంలో చూస్తే..సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగానే 33/11 కె.వి క్యాతన్ పల్లి సబ్ స్టేషన్ లో అదనపు 5-ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను గురువారం మంచిర్యాల జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ గంగాధర్ చేతుల మీదుగా ప్రారంభిచారు.ఆ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో విద్యుత్ స్థానిక వినియోగదారులకు అసలు విద్యుత్ సమస్య తలెత్తకుండా తక్కువ వొల్టేజ్ సమస్య నుంచి అదిగమించడం కొరకు అదనపు పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను బిగించారు.ఆ కార్యక్రమంలో డీఈ,ఆపరేషన్ కైసర్,డీఈ యం ఆర్ టీ రాజన్న,ఎడీయం ఆర్ టీ శరత్,మంచిర్యాల రూలర్ ఏడి ఈ.మోహన్ రెడ్డి,క్యాతన పల్లి ఏఈ ప్రభాకర్, స
బ్స్టేషన్ విద్యుత్ ఉద్యోగ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment