మైసమ్మ తల్లి మా..కోరికలు నెరవేర్చమ్మో...
మైసమ్మ తల్లి మా..కోరికలు నెరవేర్చమ్మో...
-- విశేషంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు
-- మూడవరోజు మైసమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో పూజలు
-- గాంధారి ఖిల్లా గుట్ట కింద ప్రజా దర్బార్
-- ముఖ్యఅతిథి చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి ప్రసంగం..
-- మందమర్రి సిఐ కే.శశిధర్ రెడ్డి ప్రసంగం...
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 16 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల బొక్కలగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం మూడవరోజు విశేషంగా వేలాది సంఖ్యలో భక్తులు హాజరైనారు.ఆ నేపథ్యంలోనే ఉదయం నుంచి మైసమ్మ తల్లి మహా జాతర చివరి రోజు పెద్ద ఎత్తున కొనసాగింది.అయితే ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఆ మైసమ్మ తల్లి మహా జాతర నేటి ఆదివారంతో ముగుస్తుంది.కాగా చివరి రోజు భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడి జాతరకు తండోపతండాలుగా హాజరైనారు.దాంతో కోరికలు తీర్చే మైసమ్మ తల్లికి కోళ్లు మేకలను బలి అర్పణలు చేశారు.అనంతరం గుట్ట కిందనే వంటలు వండుకొని కుటుంబ సమేతంగా భక్తులు భోజనాలు చేయడం జరిగింది.దానికి ముందు గుట్టమీదికి చేరుకొని మైసమ్మ తల్లి తో పాటు దేవతలను ఆదివాసి నాయక్ పోడు సంఘం ఆధ్వర్యంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.ఈ మహా జాతరలో చివరి రోజు ముఖ్యఅతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఆ సమయంలో గుట్ట మీదకు చేరుకొని ఆయన దేవతకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.అనంతరం గుట్ట కింద నిర్వహించిన ప్రజాదర్బాల్లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ ఆదివాసీ నాయక్ పోడు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి ఎమ్మెల్యే అక్కడి వేదికపై హాజరైనారు.ఆ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ భక్తులను,ఆదివాసి నాయక్ పోడు సంఘ గిరిజన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.రాబోయే కాలంలో తాను ఎమ్మెల్యేగా అధికారం ఉన్న సమయంలో గాంధారి ఖిల్లా మైసమ్మ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని అలాగే ఆదివాసి నాయక్ పోడు సంఘం యొక్క సొంత ఆఫీస్ కు 20 లక్షలతో కొత్తగా నిర్మాణం చేపిస్తామని తెలిపారు.అలాగే క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.అనంతరం మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తో కలిసి ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్టులతో మాట్లాడారు.గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ప్రధానంగా ట్రాఫిక్ జామ్ సమస్య లేకుండా కిలోమీటర్ల దూరం నుంచి రోడ్డుకు ఇరువైపులా భక్తుల కోసం సమస్యలు లేకుండా రాకుండా ఉండడానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆదేశాలు మేరకు మంచిర్యాల డిసిపి భాస్కర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ సూచనలు మేరకు గాంధారి ఖిల్లా మైసమ్మ మహా జాతరకు వచ్చే భక్తుల రక్షణ కోసం మందమర్రి సర్కిల్ లోని పోలీసులు ఇంకా ఇతర పోలీసు విభాగం యొక్క పోలీసు అధికారులు పోలీసులు ఉద్యోగరీత్యా విధులు చేపట్టినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జంగం కల మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి ఆదివాసి నాయకుడు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్ వాళ్ల యొక్క సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Post a Comment