గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను భక్తులు విజయవంతం చేయాలి
గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను భక్తులు విజయవంతం చేయాలి
--- ట్రాఫిక్ జాం లేకుండా జాతర సజావుగా జరిగే విధంగా సహకరించాలి
--- మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాజు,ఆర్కేపి ఎస్ ఐ రాజశేఖర్ ప్రసంగం...
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 12 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఈనెల 14,15,16 తేదీలలో భారీ ఎత్తున నిర్వహించడానికి రంగం సిద్ధమైంది.ఆ జాతర యొక్క ఏర్పాట్లను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శశిధర్ రెడ్డి,క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ లు బుధవారం అక్కడి ప్రదేశాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి, కమిషనర్ రాజు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.ఆ జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.భక్తులు సంబంధిత అధికారులు,పోలీసులకు తప్పకుండా సహకరించాలని ఏలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తిశ్రద్ధలతో మూడు రోజుల పాటు చేపడుతున్న ఆ జాతరను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్ పోడు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పి.భార్గవ్, రాష్ట్ర,జిల్లా కమిటీ నాయకులు,సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బంది,
తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment