ఇంట్లో చోరీ కేసులో ఆ ఇద్దరు దొంగలు అరెస్టు
ఇంట్లో చోరీ కేసులో ఆ ఇద్దరు దొంగలు అరెస్టు
-- దొంగలను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
-- ఆర్కేపి ఎస్ ఐ జి.రాజశేఖర్ ప్రకటన
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 8 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోటేశ్వరరావు పల్లి గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేసిన ఆ ఇద్దరు దొంగలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు శుక్రవారం ఆర్ కె పి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే...సంబంధిత గ్రామంలోని కందికట్ల సత్తమ్మ ఆమె భర్త రాజయ్య వాళ్ళ యొక్క కుమారుడు వాళ్ళ యొక్క అవసర నిమిత్తం బయటకు వెళ్లారు.ఆ తర్వాత మరుసటి రోజు శుక్రవారం వాళ్ళ సొంత ఇంటికి రావడంతో సొంత ఇంట్లోని తలుపులు తెరిచి ఉన్నాయి.అలాగే ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారు చంద్రహారం కమ్మలు మాటీలు ఉంగరం వెండి పట్టీలు కనిపించలేదు.దాంతో వెంటనే బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఆ సమయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో క్యాతనపల్లి కమాన్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆ ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకొని విచారించడంతో వాళ్ల వద్ద బంగారు ఆభరణాలతో కూడిన పరుసు ఒకటి లభించింది.దాంతో ఆ దొంగలు ఆ ఇంట్లో దొంగతనం చేసినట్లుగా నిర్ధారణ జరిగింది.ఆ దొంగతనం చేసిన వారిలో పాత నేరస్తుడుగా ఉన్న నదీమ్ అన్సారి,అబ్దుల్ కరీం లు ఉన్నారు ఆ ఇద్దరి దొంగలను వెంటనే కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్సై జి. రాజశేఖర్ తెలిపారు.
Comments
Post a Comment