జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కు సిద్ధం

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కు సిద్ధం


--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

జర్నలిస్టు తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్రంలో జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం,ఎన్నికల కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది.ఆ క్రమంలో చూస్తే..నేడు ఎన్నికల కమిషన్ రాష్ట్రస్థాయిలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది.మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం జెడ్పిటిసి,ఎంపీటీసీల రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకోవడానికి సమావేశం బుధవారం ఈ రోజు నిర్వహించనుంది.కాగా ఇప్పటికే గ్రామాల్లో రాజకీయ పార్టీలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికపై సర్వేలు నిర్వహిస్తున్నారు.అధికారులు కూడా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీటీసీ పోలీస్ స్టేషన్ల వారీగా డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేశారు. దాంతో ఈ వారంలోనే ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి