తెలంగాణలో అధికారం కోసం కసితో పనిచేస్తున్నాం

తెలంగాణలో అధికారం కోసం




కసితో పనిచేస్తున్నాం 





-  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ కసితో పని చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా ప్రభారీల సమావేశం రామకృష్ణాపూర్లోని ఏం ఎన్ ఆర్ గార్డెన్స్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ హాజరైనారు.ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు.బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏం.కొమురయ్య,పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలను గెలిపించాలని కోరారు.ఉమ్మడి కరీంనగర్,అదిలాబాద్,మెదక్, నిజామాబాద్ పట్టబద్రుల,ఉపాధ్యాయుల ఎమ్మెల్సి  ఎన్నికలు- 2025లో ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే..రాష్ట్రంలో కూడా భవిషత్తులో భాజపా తప్పకుండా గెలుస్తుందన్నారు.కే సి ఆర్ ఇంకా రేవంత్ పాలనల తీరుపై తీవ్రంగా విమర్శించారు.ఓటు అడిగే హక్కు బిజేపికి మాత్రమే ఉందన్నారు.ఈ14 నెలల కాలంలో కాంగ్రెస్ సిఎం చేసింది ఏమి లేదన్నారు.ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.అసలు కేటీఆర్ అరెస్టు ఏమైందన్నారు.కాంగ్రెస్ బిఆర్ఎస్ లు రెండు ఒకటే అన్నారు.వాళ్ల యొక్క చేతులు ద్వారా ఖజానా మారాయన్నారు.అయితే రేవంత్ ను జైలుకు పంపిన కే సి ఆర్ ను సిఏం రేవంత్ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ బి ఆర్ ఎస్ రెండు ఒకటి అయ్యాయాన్నారు.109 కేసులు తనపై ఉన్న కూడా ప్రజల కోసం ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నట్లు ప్రసంగించారు.ముఖ్యంగా దేశంలో మెడి పాలన చాలా బాగుందన్నారు.సింగరేణిని కాపాడుతుంది బిజెపి మాత్రమే అన్నారు.హక్కుల కోసం పోరాటం చేసింది బిజేపి మాత్రమే అన్నారు. బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.బి ఆర్ ఎస్ పాలనకు ఇంకా కాంగ్రెస్ పాలనకు అసలు ఎలాంటి తేడా లేదన్నారు.రాష్ట్రంలో బిజెపి అధికారం కోసం కసితో పని చేస్తున్నామన్నారు.మంచిర్యాల జిల్లాలోలో 30 వేళ ఓట్లు ఉన్నాయని అందరు ఓటేయాలన్నారు.అందరు ఓటర్లు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేల చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,కామరెడ్డి ఏంఎల్ఏ కే.వెంకట రమణ రెడ్డి,భాజపా మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్,వెంకటేశ్వర్లు,అశోక్,గుమాస శ్రీనివాస్,ఆరుముల్ల పోశం,సునీల్ రెడ్డి,మాజీ ఏంఎల్ఎ శ్రీదేవి, పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి