చెన్నూరు ఆసుపత్రిలో ఎమ్మెల్యే వివేక్ ఆకస్మికంగా తనిఖీలు

చెన్నూరు ఆసుపత్రిలో ఎమ్మెల్యే వివేక్ ఆకస్మికంగా తనిఖీలు 

 --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

చెన్నూరు న్యూస్ ఫిబ్రవరి 07 జర్నలిస్టు తెలుగు దినపత్రిక ;  మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ పరిధిలో డయోరియా వ్యాధి వ్యాప్తి విషయంలో చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని శుక్రవారం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వివేక్ తెలిపారు. ఆ నేపథ్యంలోనే సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేరోగులకు సరైన సౌకర్యాలతోపాటు వైద్యం అందించాలని సూచించారు.ఆ వైద్యులు,సిబ్బంది,విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి వాళ్ల యొక్క బాగోగులను ఆయన అడిగి తెలుసుకున్నారు.



Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి