పోలీసు సమస్యల పరిష్కారానికే దర్బార్

 పోలీసు సమస్యల పరిష్కారానికే దర్బార్




-  రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్

-  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ క్యూ ఆర్ టి సిబ్బంది అధికారులకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.శ్రీనివాస్ ఆదేశాలు మేరకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో "దర్బార్" కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపి ముఖ్యఅతిథిగా హాజరైనారు.స్పెషల్ పార్టీ యు ఆర్ టి సిబ్బందితో పోలీస్ కమిషనర్  మాట్లాడినారు.వాళ్ల యొక్క సమస్యలను ఒక్కొక్కరిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.ఏలాంటి సమస్య ఉన్న దర్బార్ లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే నేరుగా ఆఫీస్ కు వచ్చి కలిసి తెలుపాలని పేర్కొన్నారు.ఆ సందర్బంగా సీపీ మాట్లాడుతూ..స్పెషల్ పార్టీ క్యూ ఆర్ టి పోలీస్‌ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోనాల్సి ఉంటుందని తెలిపారు.క్రమశిక్షణ ప్రణాళికబద్దంగా విధులు నిర్వహించడంతో ద్వారానే ఒత్తిళ్లను అధిగమించవచ్చని ప్రకటించారు.వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని గుర్తు చేశారు.ఆ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబము రోడ్డున పడుతుందని వివరించారు.ముఖ్యంగా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు సొంత కుటుంబం గురించి ఆలోచించాలని సూచించారు.పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని రామగుండం కమిషనరేట్ కు తెలంగాణ పోలిస్ మంచిపేరు తీసుకురావాలన్నారు.బయట డ్యూటీస్ కి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఉంటె సంబందిత అదికారులకు రిపోర్ట్ చేయాలన్నారు.సిబ్బంది క్రమ శిక్షణ మంచిప్రవర్తనతో విధులు నిర్వహిస్తే అదికారులు తమ వెంట ఉంటామన్నారు.ఆ చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు  అలవాటు పడి విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన శాఖ పరమైన చర్య తీసుకొవడం జరుగుతుందన్నారు.ఆ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ.రాజు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆర్ఐ లు దామోదర్ శ్రీనివాస్ ఆర్ ఎస్ఐ లు సిబ్బంది పాల్గోన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి