ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్!
ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్!
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక ప్రెస్ అండ్ మీడియా న్యూస్
హైదరాబాద్ న్యూస్ ఫిబ్రవరి 05 : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ పోలింగ్ కొనసాగింది. ఆ నేపథ్యంలోనే ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు.ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,ఆమ్ ఆద్మీ పార్టీ,కాంగ్రెస్ పార్టీల మధ్య ఆ త్రిముఖ పోటీ నెలకొంది.ఈ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.దాంతో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగింది.కాగా ఈ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు.ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.అదే సమయంలో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ చేపట్టారు.ఇందుకు గానూ 13 వేల 766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా,1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.వాటిలో 3 వేలకు పోలింగ్ సెంటర్లను సమస్యాత్మకమైవనిగా గుర్తించి అక్కడ గట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు.
--- డ్రోన్లు,సీసీ కెమెరాలతో పోలీసు నిఘాను పెంచారు...
ఒకవైపు ఢిల్లీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంటే,పొద్దున్నే పూజల సందడి కనిపిస్తోంది.బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ
యమునా ఘాట్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు.మరోవైపు మాజీ మంత్రి మనీష్ సిసోడియా కూడా పూజలు చేశారు.
కల్కాజీలోని ఒక ఆలయంలో సిసోడియా పూజలు నిర్వహించారు. ఇక, ఎన్నికల నేపథ్యంలో అయా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ అధికారులు నిర్వహించారు.
Comments
Post a Comment