సింగరేణిలో జాబ్ ప్రొటెక్షన్ ను వెంటనే అమలుచేయాలి
సింగరేణిలో జాబ్ ప్రొటెక్షన్ ను వెంటనే అమలుచేయాలి
-- హెచ్ఎంఎస్ నాయకులు జే.శ్రీనివాస్
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక ప్రెస్ అండ్ మీడియా న్యూస్
మందమర్రి న్యూస్ ఫిబ్రవరి 5 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న కార్మికులకు జాబ్ ప్రొటేక్షన్ వెంటనే అమలు చేయాలని హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు జే.శ్రీనివాస్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మందమర్రిలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన
మాట్లాడుతూ..గడిచిన 20 యేండ్లనుంచి అండర్ గ్రౌండ్ అన్ ఫిట్ అయిన సోదరులు మైనింగ్ స్టాఫ్,ఫిట్టర్,ఎలక్ట్రీషియన్ లాంటి టెక్నీషియన్లను స్టంట్స్ పడి లేదా ఆక్సిడెంట్ అయి అనారోగ్యంతో ఉన్న ఆ కార్మికులను జాబ్ ప్రొటెక్షన్ లేకుండా ఇంకా మానసికంగా బాధపెట్టేలా అండర్ గ్రౌండ్ ఆన్ఫిట్ అయితే సర్ఫేస్ జనరల్ మజ్ధూర్లుగా నియమించడం జరిగిందన్నారు.ఆ దారుణమైన స్థితిని గతిని మార్చే దిక్కేలేకుండా గత పదేండ్లు టీబీజీకేఎస్ హయాంలో అడిగేదిక్కేలేక గోసపడ్డారన్నారు.ఆ టెక్నీషియన్స్, మైనింగ్ సూపర్ వైజర్స్ ఎంతమంది టెక్నికల్ అండ్ మైనింగ్ సోదరులను జనరల్ మజ్ధూర్లగా డీప్రమోట్ చేశారో వారందరినీ బేషరతుగా వారివారి పాత డిజిగ్నేషన్లను తిరిగి ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఆ నేపథ్యంలోనే సింగరేణి అభివృద్ధిలో భాగంగా ఇతరరంగాలైనా థర్మల్,సోలార్,మిథెనాల్,హైడ్రో, విండ్ లాంటి రంగాలలో ప్రవేశించడం శుభసూచకమే కానీ అక్కడ ఉపాధిని ప్రైవేట్, కాంట్రాక్టు కార్మికులతో కాకుండా సింగరేణి కార్మికులతో పనిచేయించాలని పేర్కొన్నారు.ఆ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జే.శ్రీనివాస్,సెంట్రల్ నాయకులు వెల్దిసుదర్శన్,చొప్పరిరామస్వామి,రాయమల్లు,అశోక్ కుమార్,సంతోష్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment