ఆసుపత్రిలో రెండు రోజులు శవానికి ట్రీట్మెంట్ ?

ఆసుపత్రిలో రెండు రోజులు శవానికి ట్రీట్మెంట్ ?

---  హెల్త్ మినిస్టర్ సీరియస్..!!

---  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్....

హైదరాబాద్ మియాపూర్ లోని


సిద్ధార్థ హస్పటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ క్రమంలో చూస్తే..రెండు రోజులు శవానికి ట్రీట్ మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు.అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు.మినిస్టర్ ఆదేశాలో ఫిబ్రవరి 10న ఆరోగ్యశాఖ అధికారులు మియాపూర్ లోని సిద్దార్థ్ హాస్పిటల్ కు వచ్చారు.ఆ హాస్పిటల్ లో తనిఖీలు చేశారు.అయితే సిద్దార్థ్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించలేదు.కడప జిల్లాకు చెందిన సుహాసిని(26) కండ్లు తిరిగి పడిపోవడంతో నెల రోజుల క్రితం సిద్దార్థ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు.అయితే చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారని ఇంకా డబ్బులుకట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్కు తీసుకెళ్లాలని చెప్పారని ఆ మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు.నిమ్స్ కు తరలించగా సుహాసిని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు.దాంతో సుహాసిని ఫ్యామిలీ మెంబర్స్ ఆ హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు.రెండు,మూడు రోజుల క్రితమే చనిపోయినా తమకు సమాచారం ఇవ్వకుండా ట్రీట్మెంట్ పేరుతో డ్రామాలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి