అందరూ రక్తదానం చేయాలి - ఆరోగ్యంతో ఉండాలి
అందరూ రక్తదానం చేయాలి - ఆరోగ్యంతో ఉండాలి
20న- రేపు ఆర్కేపి తవక్కల్ పాఠశాలలో రక్తదాన శిబిరం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల తవక్కల్ ఉన్నత పాఠశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి.అబ్దుల్ అజీజ్ యొక్క 57వ జన్మదినo పురస్కరించుకొని సంబంధిత రక్తదాన శిబిరం స్థానిక తవక్కల్ మెయిన్ స్కూల్ లో ఏర్పాటు చేశారు.మంచిర్యాల జిల్లాలోని తల సేమియా,సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులతోపాటు ఇంకా ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరం ఉన్న వాళ్ళ కోసం అటుపిమ్మట ప్రజలకు అత్యవసర రక్తం కోసం ఆ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు.ప్రధానంగా చెప్పాలంటే సాటి తోటి మనిషిని రక్షించే రక్త దానం చేయడమంటే మహాదానంగా మనందరికీ తెలిసిందే.అయితే మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆ బ్లడ్ డొనేట్ క్యాంప్ కు జిల్లాలోని రక్త దాతలు యువకులు రక్తం ఇవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో నిర్ణీత సమయంలో హాజరై రక్తదానం చేయాలని రామకృష్ణాపూర్ పట్టణంలోని సాంఘిక సేవ సంఘకర్త ఎండి.పాషా,తవక్కల్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ కోరారు.అంతేకాకుండా అత్యవసర సమయంలో ఎదుటివాళ్లకు ప్రాణాపాయ స్థితిలో మన రక్తం ఇచ్చి రక్షించే గొప్ప ధన్యత-కృతజ్ఞతలు కూడా రక్తదానం చేసిన వాళ్లకు ఉంటాయని వస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం లేదు.ఈ కార్యక్రమంలో ఆర్కేపీ జనం కోసం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబెల్లి రాజేష్,పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment