విలేకరుల ముసుగులో దందాలకు పాల్పడుతున్నా వ్యక్తులపై కేసు నమోదు?
విలేకరుల ముసుగులో దందాలకు పాల్పడుతున్నా వ్యక్తులపై కేసు నమోదు?
-- ఎవరైన అలాంటి బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలి
-- ఎస్ఐ శ్యామ్ పటేల్ ప్రకటన
నీల్వాయి న్యూస్ ఫిబ్రవరి 9 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : తేదీ 09-02-2025న జక్కుల శ్రీధర్, మొగిలి అనిల్ లు,గోదావరిఖని, రాజన్నల కులానికి చెందిన మారుభేరస్తులు సంపుటం గ్రామంలో 6 ఎద్దులను కొనుగోలు చేసుకుని ఒక మహేంద్ర వ్యాన్లో పెద్దపల్లి పశువుల సంతకు అమ్ముకొనుటకు తీసుకెళుతుండగా తెల్లవారుజామున అందాజ 3-20 నిమిషములకు ఒక ఫోర్డ్ కార్ నెంబర్ ఏపీ 36 ఎం 1166 గలదానిలో 7 గురు వ్యక్తులు (1 చొప్పదండి జనార్ధన్ (నేటితరం విలేకరి) మూగజీవాల సేవా సంఘం అధ్యక్షులు, డి జె ఎఫ్ డిస్టిక్ వి.ప్రెసిడెంట్ 2) తుంగ రమేష్ (జిల్లా వాణి విలేఖరి) 3) మాసాని రమేష్ (భద్రాద్రి న్యూస్ రిపోర్టర్) 4) తోడేటి సంతోష్ (జిల్లా వాణి రిపోర్టర్) 5) జిల్లపల్లి పోచం (జిల్లా వాణి రిపోర్టర్) 6) తగరం వెంకటేష్ (ధ్రువ న్యూs 7) దొబ్బల విష్ణు(జిల్లా వాణి రిపోర్టర్) అను వారు వేమనపల్లి వైన్స్ షాప్ దగ్గరలో ఆ పశువుల వ్యాను అడ్డగించినట్లు ఎస్సై తెలిపారు.తాము విలేకరులమని అందులో ఆవులు ఉన్నాయని,పరిమితికి మించి తీసుకపోతున్నారని,అందులో ఒకరు మూగజీవాల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడనని ఆ వ్యాన్ లో ఉన్న ఫిర్యాదుని ఇంకా మరో వ్యక్తిని వ్యాన్ సీజ్ చేపిస్తామని ఇంకా జైలుకు కూడా పంపిస్తామని భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిపారు.దాంతో డబ్బులు డిమాండ్ చేయగా ఒప్పుకోలేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇస్తున్నామని చెప్పి నట్లు మళ్లీ ఇటువైపు బేరానికి వస్తే మీ సంగతి చూస్తామని కూడా బెదిరించినట్లు పిర్యాదు చేయడం జరిగిందన్నారు.ఆ ఫిర్యాది తేదీ 20 జనవరి 2025న తెల్లారి జామున మూడు గంటలకు ఫిర్యాది అన్న కొడుకు గాదె మహేష్ బర్లను(గేదెల) కొనుక్కొని కల్లంపల్లి నుంచి గోదావరిఖనికి వెళ్లుచుండగా కల్లంపల్లి స్కూల్ దగ్గర ఆ వాహనాన్ని అడ్డగించి బజరంగ్దళ్,గోసంరక్షకులమని కొందరు,మరికొందరు విలేకరులమని 3 లక్షలు ఇవ్వమని లేకుంటే కేసులు పెడదామని బెదిరించి డబ్బులు ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామని కూడా బెదిరించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తుల బెదిరింపులకు భయపడి ఫిర్యాది 25 వేల నగదు మహేష్ తన ఫోన్ పే నెంబర్ 9177322625 నుంచి అందులోనే ఉన్న తోడేటి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ పే నెంబర్ 966 68643కి బలవంతంగా ఫోన్ పే ద్వారా డబ్బు బదిలీ చేయించుకున్నట్లు పేర్కొన్నారు.అలాగే తేదీ 3 ఫిబ్రవరి 2025న పైన పేర్కొన్న వ్యక్తులు మాస్కులు ధరించి ఆ ఫిర్యాదు బావమరిది ఆవులు ఐలయ్య దున్నపోతులు కల్లంపల్లిలో కొనుక్కొని వ్యానులో గోదావరిఖని తీసుక వెళ్ళచుండగా దస్నాపూర్ ఆశ్రమ పాఠశాల మూలమలుపు వద్ద మళ్ళీ ఆపి లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో పాటు 15000 నగదు కూడా తీసుకోవడం జరిగిందని వివరించారు.రాజన్నల కులానికి చెందిన వారిని విలేకరుల ముసుగులో భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు కాజేసారని వాళ్లపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఫిర్యాది కోరినట్లు తెలిపారు.ఆ మేరకు వారందరిపై కేసు నమోదు చేసినట్లు వాళ్ళ యొక్క ఆగడాలపై బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా నీల్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ ప్రకటించారు.కాగా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Post a Comment