మంచిర్యాల కోర్టు ప్రాంగణంలో రక్తదాన శిబిరం

 మంచిర్యాల కోర్టు ప్రాంగణంలో రక్తదాన శిబిరం

-  ముఖ్యఅతిథి జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు

-  38 మంది దాతలు స్వచ్ఛందంగా రక్తదానం 

-   మంచిర్యాల జడ్జి ప్రసంగం...

-  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ !!

మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బోయ శ్రీనివాసులు -మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ ల యొక్క సహకారంతో లయన్ వి.మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో మంచిర్యాల పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు.ఆ రక్తదానం శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ స్టేషన్స్ డిస్ట్రిక్ట్స్ జడ్జి బోయ శ్రీనివాసులు వాళ్ల యొక్క సతీమణి శ్రీదేవిలు హాజరైనారు.దాంతో ఆ జడ్జి దంపతులు ముందుగా రక్తదానం చేశారు.ఆ తరుణంలో జడ్జి దంపతులు




అందరికీ ఆదర్శంగా కూడా నిలిచారు.అనంతరం రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలాగే సీనియర్ సివిల్ జడ్జిలు రామ్మోహన్ రెడ్డి,నిరోషా,సంపత్, నరసయ్య,ఏవో రామబ్రహ్మం,సాగర్,చారి, మంజుల,బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్,న్యాయవాదులు ఇంకా  సిబ్బంది దాదాపు 38 మంది ఆ శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఆ సందర్భంగా మంచిర్యాల జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలిపారు.ఆ రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలను వివరించారు.కాగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి దాతలు రక్తదానం చేయడానికి ముందు రావలని కోరారు. అనంతరం అక్కడి కార్యక్రమం యొక్క ప్రోగ్రామ్ చైర్పర్సన్ లయన్ వి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా సమర్పించిన వినతి పత్రానికి జడ్జి వెంటనే స్పందించి ఆరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆ నేపథ్యంలోనే త్వరలో లైన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరాన్ని కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఆ కార్యక్రమంలో లయన్ వి.మధుసూదన్ రెడ్డి,లయన్ వి.వినయ్ కుమార్,రెడ్ క్రాస్ కార్యదర్శి చందూరి మహేందర్,రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస్,ఎడ్ల కిషన్,అడ్వకేట్ మల్లారెడ్డి,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది,కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి