ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్..రెండు లారీలు"ఢీ"ఒకరు మృతి-మరొకరికి గాయాలు




ఫ్లాష్..ఫ్లాష్  న్యూస్..

రెండు లారీలు "ఢీ" ఒకరు మృతి-మరొకరికి గాయాలు 

---  ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు విధులు

---  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.... 

మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 11 : మంచిర్యాల జిల్లాలో గల మందమర్రి మండలంలోని పులిమడుగు - మేడారం సమీపంలో గల జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు ఒకటి--ఒకటికి ఢీకొనడంతో ఒక లారీ డ్రైవర్ కొన ఊపిరితో అక్కడికక్కడే సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.ఆ క్రమంలో చూస్తే..మేడారం సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న లారీని వెనకాల నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఈరోజు ఢీకొంది.దాంతో ఒక లారీ బలంగా ఫల్టీకొడుతూ పక్కకు పడింది.ఆ ఢీ కొట్టిన లారీలో ఉన్న డ్రైవర్ కనకయ్య (40) అనే వ్యక్తి కన్నాల బసంత్ నగర్ లోని నివాసిడిగా గుర్తించారు.అలాగే అక్కడి చెట్లకు నీళ్లు పడుతున్న మందమర్రికి చెందిన తిరుపతి కి సైతం ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే వాళ్ళిద్దరినీ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా మందమర్రి ఎస్ ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పడకుండా కట్టుదిట్టమైన విధులు నిర్వహించడం కనిపించింది.ఆ మేరకు ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి