క్రైస్తవ మహిళలను ఘనంగా సత్కరించిన కలువల శ్రీనివాస్ - స్టెల్లా దంపతులు

క్రైస్తవ మహిళలను ఘనంగా సత్కరించిన కలువల శ్రీనివాస్ - స్టెల్లా దంపతులు

 --   దంపతులను గౌరవిస్తూ సన్మానించిన వైనం 

జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సెయింట్ పీటర్స్ చర్చి ఆలయానికి సంబంధించిన క్రైస్తవ మహిళలను జర్నలిస్టు తెలుగు దినపత్రిక ఎడిటర్ కలువల శ్రీనివాస్ స్టెల్లా దంపతులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఆ క్రమంలో చూస్తే.. ప్రస్తుతం యేసు ప్రభువు యొక్క శ్రమల ధ్యాన గృహ ఆరాధనలు సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు ఉపవాసాలతో కూడిన ఆరాధనలు నిర్వహిస్తున్నారు.అయితే సి ఎస్ ఐ చర్చికి సంబంధించిన మూడవ గ్రూపులో ఆ గ్రూప్ లీడర్ గా కే.దేవానంద్ ఆధ్వర్యంలో సంబంధిత క్రైస్తవ ఆరాధన గృహ కూడికలు చేపట్టడం జరుగుతుంది.దాంట్లో భాగంగానే సోమవారం జర్నలిస్టు పత్రిక అండ్ టీవీ ఎడిటర్ కలువల శ్రీనివాస్ - స్టెల్లా కుటుంబం యొక్క ఇంట్లో ఈరోజు యేసుప్రభు యొక్క ఆరాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే ఆరాధనకు హాజరైన క్రైస్తవులు ఏసుప్రభు దేవుడు శ్రమల దినం కాలంలో ఆ ఏసుక్రీస్తు ఎదుర్కొన్న అనేక కష్టాలను గుర్తు చేసుకుంటూ ఆరాధించడం ప్రార్థించడం దేవుని పాటలతో గొప్పగా స్తుతించడం జరిగింది.ఆ సందర్భంగా చర్చికి సంబంధించిన బ్రదర్ నెల్సన్ దేవుని వాక్యంను మంచి సందేశంగా వివరించారు. అనంతరం క్రైస్తవులందరూ కూడా బైబిల్ గ్రంధంలోని దేవుని వాక్యములు చదువుకొని ఏసుక్రీస్తు ప్రభువు దేవుని సందేశమును కూడా వినడంతోపాటు ప్రార్థనలు చేశారు.అనంతరం ఆరాధనలో హాజరైన మహిళలకు అలాగే క్రైస్తవ దంపతులందరికీ కూడా మహిళ దినోత్సవం పురస్కరించుకొని గౌరవంగా శాలువాలు కప్పి శ్రీనివాస్-స్టెల్లా 













సత్కరించారు.ఆ కార్యక్రమంలో సీఎస్ఐ చర్చి మూడవ గ్రూపు లీడర్ కే.దేవానందం,బ్రదర్ నెల్సన్,మాజీ చర్చి కమిటీ సభ్యుడు టి.ఆనంద్, మాజీ కోఆర్డినేటర్ టి.సుహాసిని,మాజీ ఏరియా లీడర్ కృపసామెల్,గ్రేస్ అమ్మ, రమేష్ పాస్టర్ దంపతులు,క్రైస్తవ సోదరీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి