అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు



 

--  11 మంది అంగన్వాడి సిబ్బందిపై కేసు నమోదు 

--  ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..

రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి 4 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : ప్రజాభవన్ ముట్టడి కోసం హైదరాబాదుకు వెళ్తున్న (11) మంది అంగన్వాడీ సిబ్బందిని మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆ క్రమంలో చూస్తే..ఆర్కేపి పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఇంకా-జోన్ సెంటర్ లో 11 మంది అంగన్వాడీ సిబ్బంది అందరు కలిసి ఈరోజు హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముట్టడికి కోసం గుమిగూడినారు.ఆ నేపథ్యంలోనే ప్రభుత్వంకు వ్యతిరేకంగా అంగన్వాడీ టీచర్లు నినాదాలు చేసారు.ఈ సమయంలో ఆ టీచర్ల బృందం యొక్క చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నట్లు తేలడంతో ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకోన్నారు.దాంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.అనంతరం అండర్ సెక్షన్ -170 ఆఫ్ బి ఎన్ ఎస్ ప్రకారం టీచర్ల మీద పోలీసు కేసు చేసినట్లు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి