రాజీవ్ యువ వికాస ధరఖాస్తుల తేదీ గడువు పెంచారు

రాజీవ్ యువ వికాస ధరఖాస్తుల తేదీ గడువు పెంచారు


- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

మంచిర్యాల న్యూస్ మార్చి-31 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : తెలంగాణలో యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం "రాజీవ్ యువ వికాస"(Rajeev Yuva Vikasa) గా ఉంది.అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 5గా ప్రకటన చేశారు.ఆ ధరఖాస్తుల స్వీకరణలో రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రాజీవ్ యువ వికాస ధరఖాస్తుల గడువును ఏప్రిల్- 14 తేదీ వరకు పొడిగిస్తూ(Applications Extended) నిర్ణయం తీసుకుంది.ఆ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓక ప్రకటన జారీ చేశారు.కాగా ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి మరో వెసులుబాటును కూడా కల్పించారు.ఆ నేపథ్యంలోనే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ఆదాయ ధృవీకరణపత్రం అవసరం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ మహిళలు,పురుషులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.దానికోసం ఆయా కార్పొరేషన్లకు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది సర్కార్.దాంతో18 ఏళ్ల నుంచి 55 ఏళ్లు వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.ముఖ్యంగా ఒక రేషన్ కార్డు మీద ఒక లబ్దిదారుడు మాత్రమే ఈ పథకాన్ని పొందనున్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి