పెద్దపల్లి ఎంపి కృషి ఫలితంగానే 140 కోట్ల పెన్షన్ ఫండ్

పెద్దపల్లి ఎంపి కృషి ఫలితంగానే 140 కోట్ల పెన్షన్ ఫండ్

రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-19 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : సింగరేణి కార్మికులు పెన్షన్ పథకం గత మూడు దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.దాంతో కార్మికుల భవిష్యత్ పై గత35 సంవత్సరాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థలకు వ్యతిరేకంగా పార్లమెంటులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పలుసార్లు మాట్లాడారు.ఆయన కృషి ఫలితంగా సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై 20 రూపాయల పెన్షన్ ఫండ్ కు కేటాయించేందుకు అంగీకరించింది దాని ద్వారా 140 కోట్లు రూపాయల భారీ నిధి పెన్షన్ ఫండ్ కు చేరుతుంది.ఆ పథకం అమలు కావడానికి కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ చిత్రపటానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ ఐఎన్టియుసి ఆఫీసు వద్ద శనివారం




రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.ఆ నేపథ్యంలోనే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.ఆ కార్యక్రమంలో రిటైడ్ కార్మికులు చంద్రగిరి ఎల్లయ్య,ఎల్లవేని గంగయ్య,మెట్ట సుధాకర్అడల రాజయ్య,జక్కుల రాజయ్య,అప్పని రామయ్య,సాధు సాంబయ్య,జూపాక రాజయ్య ఓజ్జా ముత్తయ్య,కరుకూరి లింగయ్య, టిపిసిసి కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి,నాయకులు కనకరాజు,గోపు రాజం,మల్యాల బాల కృష్ణా,భైరా మల్లేష్,కంకణాలు సంజీవరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి