ఈ నేల-15న క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం

 ఈ నేల-15న క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం







-  ముఖ్య అతిథులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ 

- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-13 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఈ నేల 15వ తేదీన నుంచి ప్రారంభం కాబోతోంది.ఆ క్రమంలో చూస్తే..గత పది పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్ వర్క్ లో నడుస్తున్న ఈ యొక్క క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి అధికారికంగా ప్రారంభం కాబోతుంది.ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ ప్రోగ్రాంలో భోజన వసతి కూడా కల్పించారు.ఈ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన కొడుకు కాబడిన పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.ప్రధానంగా ఈ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించకపోవడం వల్ల ప్రజలు గతంలో అనేక విధాలుగా చాలా రూపంలో చెప్పలేని విధంగా ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఇబ్బందులు అనేక రూపంలో ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు సైతం పోగొట్టుకున్న రోజులు కూడా ఇక్కడి క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద అనేకంగా ఉన్నాయని చెప్పడంలో అసలు సందేహం లేదు.ప్రజలు ఎప్పుడు మాట్లాడిన కూడా ఈ క్యాతనపల్లి రైల్వే గేటు ఎప్పుడు ప్రారంభం అవుతుంది.ఎందుకు.. ఇట్లా చేస్తున్నారు అనే ప్రశ్నలు?ప్రతిసారి కూడా తుఫాను వర్షం మాదిరిగానే వస్తుండేవి.ఆనాటి పాలకవర్గం అస్సలు పట్టించుకోవడమే కాకుండా ప్రజల శాపనార్థాలకు కూడా గురైన రోజులు కూడా ఉన్నాయి.ఈ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం కావడంతో రామకృష్ణాపూర్ పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు మందమర్రి,సారంగపల్లి,ఊరు రామకృష్ణాపూర్,అమరావాది,శేషుపల్లి, సారంగపల్లి,పాకిస్తాన్ క్యాంప్, ఇంకా చుట్టుపక్క ప్రాంతాల గ్రామ ప్రజలకు అలాగే మంచిర్యాలలో నివసించే ప్రజలకు కూడా రామకృష్ణ పూర్ రావడానికి తిరిగి వెళ్లడానికి మంచి సౌకర్యంగా తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలుగా ఉంటుంది.ఈ సమయంలో క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఓపెన్ కావడంతో స్థానిక ప్రజల చిరకాల కోరిక 2025 ఏప్రిల్ 15 తేదీన నేరవేరుతుందని తెలుస్తుంది.ఈ తరుణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలని గతంలో చాలాసార్లు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారుల దృష్టికి ఇంకా పాలకవర్గం దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది.ఏది ఏమైనా కూడా క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మంగళవారం ఉదయం 10:30 గంటలకు అధికారికంగా ప్రారంభం కాబోతుందని దానికి అందరూ కూడా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ నాయకులు పి.రఘునాథరెడ్డి, పల్లె రాజు,గాండ్ల సమ్మయ్య,అబ్దుల్ అజీజ్ తోపాటు స్థానిక నాయకులు రెండు రోజుల క్రితం ప్రకటించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి