ఆహారకల్తీలో రెండో స్థానం తెలంగాణ..నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్

ఆహారకల్తీలో రెండో స్థానం తెలంగాణ..నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్

-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.ఆ క్రమంలో చూస్తే..ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉండటం గమనార్హం.2021-24 మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు,అందులో కల్తీవిగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాల వారీగా ఇటీవల పార్లమెంటుకు నివేదించింది.ఆ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది.తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి.తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది.కేరళ 13.11 శాతం,ఆంధ్రప్రదేశ్ 9 శాతం,


కర్ణాటక 6.30 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి