అంగరంగ వైభవంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు





అంగరంగ వైభవంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా టీవీ న్యూస్...

పెద్దాపూర్ న్యూస్ ఏప్రిల్ 13 జర్నలిస్టు దినపత్రిక మరియు మీడియా న్యూస్ పెద్దపల్లి జిల్లా బ్యూరో: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇట్టి బ్రహ్మోత్సవాలలో చలువ పందిళ్లు పూల అలంకరణ పచ్చని తోరణాలతో దేవాలయాన్ని అలంకరణ చేస్తారు ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అంతా సుఖంగా జీవించాలని ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇక బ్రహ్మోత్సవాలు ఈనెల 4 నుండి 13 వరకు కొనసాగుతున్నాయి ఈ దేవాలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కొనసాగిస్తారు అందులో భాగంగానే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం  యజ్ఞ యాగాది కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రతిరోజు జరిగే యజ్ఞ కార్యక్రమంలో చాలా మంది భక్తులు జంటలుగా కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉదయం సాయంత్రం తీర్థ ప్రసాద వినియోగం చేస్తారు ఈనెల 8 తారీఖు మంగళవారం రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వేల మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించి తరిస్తారు కళ్యాణం రోజు భక్తులు పోటీపడి జాతరకు వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తారు 11 తారీఖు శుక్రవారం శకటోత్సవం అనగా బండ్లు తిరిగే కార్యక్రమం ఇది అనాదిగా ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో పెద్దాపూర్ జూలపల్లి మండలానికి సంబంధించిన భక్తులు చాలామంది ఎడ్ల బండ్లతో మరియు ఫోర్ వీలర్ వాహనాలు ట్రాక్టర్లు గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ ప్రదక్షిణ వల్ల పశుపక్షాదులు ఆరోగ్యంగా ఉంటాయని పంటలు సమృద్ధిగా పండుతాయి అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఈ గిరిప్రదక్షిణ చేస్తారు అలాగే 13 ఆదివారం ఉదయం రథోత్సవ కార్యక్రమం జరిగింది ఉదయం రథం ముందు యజ్ఞం చేసి రత బలి ఇచ్చిఎవరికీ ఏ ఆటంకం జరగకుండా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని పెరుమాళ్లను శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవమూర్తులను రథం పైకి వేయించి చేయించి రథం పై నుండి భక్తులకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు ఇట్టి జాతర మరియు రథోత్సవ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు భగవంతున్ని దర్శనం చేసుకుని వారి వారి మొక్కులు సమర్పించుకుంటారు ఇక్కడ ఏ రకమైన మొక్కలు మొక్కుకున్నా ఇట్టే తీరుస్తాడని ప్రజల కోర్కెలు తీర్చే కొంగు బంగారం లక్ష్మీనారసింహుడు అని ప్రజల నమ్మకం అలాగే మొక్కుకొని అట్టి మోక్కులను ఈ జాతర సమయంలో రథం ముందు కోళ్లను మేకలను కోసి కొబ్బరికాయలతో మొక్కులు సమర్పించుకుంటారు ఇట్టి జాతరలో యాగ్నికులు యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ముఖ్యంగా పెద్దాపూర్ గ్రామ పరిసర ప్రాంత భజనపరులు భజన బృందాలు బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు రాత్రులు భజనలతో పాటలతో భక్తులను ఉల్లాసపరుస్తారు నాయకులు భక్తులు పార్టీలకతీతంగా సేవలు చేస్తారు యువత భక్తుల దర్శన విషయంలో మంచి సేవలు అందిస్తారు పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ సిబ్బంది మంచి సేవలను అందిస్తారు జూలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న  సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఉన్న సిఐ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్సైలు మరి వారి బృందం అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూస్తారు ఇట్టి జాతర కార్యక్రమంలో సర్పంచులు ఇతర నాయకులు ఎందరు ఉన్న గొట్టేముక్కుల వారి కుటుంబం జాతర ప్రారంభం నుండి ముగింపు వరకు దగ్గరుండి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ వారి సేవలు అందిస్తారు ఈ కార్యక్రమానికి నాయకులు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు మరియు గుజ్జుల రామకృష్ణారెడ్డి మరియు చాలామంది నాయకులు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సేవించుకున్నారు

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి