మట్టల ఆదివారంతో సిఎస్ఐ చర్చి క్రైస్తవులు భారీ ఎత్తున ఊరేగింపు

మట్టల ఆదివారంతో సిఎస్ఐ చర్చి క్రైస్తవులు భారీ ఎత్తున ఊరేగింపు

-- సిఎస్ఐ చర్చి నుంచి అంబేద్కర్ అంగడి బజార్ వరకు అంజూరపుమట్టలు చేత పట్టుకొని పాదయాత్ర..

--  పాస్టర్ రెవరెండ్ ఏం.జాషువా దేవుని సందేశం

-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ న్యూస్... 








రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-13 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల యూనియన్ బ్యాంక్ ముందు ఉన్న సిఎస్ఐ- సెయింట్ పీటర్స్ చర్చ్-దేవాలయం యొక్క క్రైస్తవులు ఆదివారం అంజూరపు మట్టలు చేత పట్టుకొని దేవుని యొక్క నినాదాలు పెద్ద ఎత్తున చేస్తూ యేసు దేవుని పాటలు పాడుతూ భారీ ఎత్తున ఊరేగింపు చేశారు.అనంతరం ఏసుక్రీస్తు ప్రభువు దేవాలయంలో ఆదివారపు మట్టల ఆరాధన నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..ఈ సందర్భంగా చర్చి పాస్టర్ ఎం జాషువా దేవుని సందేశం అందించారు.పరలోకానికి భూలోకానికి అధిపతి కాబడిన ప్రపంచవ్యాప్తంగా ప్రార్థించబడుతున్న అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దేవుడు భూలోకానికి చేరుకున్న ఆ సమయంలో ఎరుషలేముకు వచ్చినప్పుడు గాడిదపై కూర్చొని వచ్చినట్లు తెలిపారు.దాంతో ఇశ్రాయేయుల ప్రజలు హోసన్నా..హోసన్నా..హోసన్నా... అంటూ ఆహ్వానం పలికినట్లు గుర్తు చేశారు.అలాగే ప్రభువా! మమ్మల్ని ప్రజలను రక్షించాలని వేడుకున్నట్లు తెలిపారు.దాంతో రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి యేసుప్రభు అనేక బాధలను అనుభవించాడని యేసు సువార్త మానంను పాస్టర్ ఆ ఏసుక్రీస్తు దేవుని గొప్ప సందేశంను క్లుప్తంగా అందించారు.ప్రధానంగా ఇశ్రాయేలుల ప్రజలను రక్షించడానికి మాత్రమే యేసు వచ్చాడనీ బైబుల్ గ్రంథంలోని అనేక అధ్యాయాలలోని దేవుని వచనములు -వాక్యాలు ద్వారా ప్రకటించారు.ముఖ్యంగా యేసు ప్రభు నీతి పరుడని తెలిపారు.కాగా యేరుషలేము దేవాలయం నుంచి ప్రజలను యేసు ఆశీర్వాదించారని తెలిపారు.ఆ నేపథ్యంలోనే క్రైస్తవ విశ్వాసులకు దేవుని నామంలో మంచి మాటలను జాషువా దైవ సేవకులు బోధించారు.యేసు క్రీస్తు ప్రభువు దేవుని మీద భయం,భక్తి,క్రమశిక్షణ తప్పకుండా కలిగి ఉండాలని పాస్టర్ తెలిపారు.ప్రతిరోజు దినసరి ప్రవర్తన సరిగా అంటే మంచిగా ఉండేలా చూసుకోవాలని దేవుని ప్రియులు ప్రేమ శాంతి దయాళత్వం కలిగి ఉండాలని వెల్లడించారు.ఆ తరుణంలో దేవుని గొప్ప సుగుణలను క్రైస్తవులకు క్రీస్తు ప్రభువు దేవుని సందేశం ద్వారా అందించారు.ప్రధానంగా నీతిమంతులు దేవునిపై నమ్మకం ఉంచాలని తెలిపారు.దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిన గొప్ప దేవుడని అభివర్ణించారు.యేసు దేవుని అడుగుజాడల్లో నడుస్తూ..ఏసుక్రీస్తు ప్రభు యొక్క క్రైస్తవులందరూ, దేవుని కుమారులు,కుమార్తెలు, ఆయన ప్రియులందరూ ఆశీర్వదించబడాలని తెలిపారు.యేసు ప్రభు శాంతి,వినయంకు సూచకమైన యెరూషలేమునకు గాడిదను ఎంపిక చేసుకొని వచ్చాడని భూలోకంలో మానవుని పాపం-రక్షణ కోసం యేసు వచ్చాడని తెలిపారు.ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కొత్త వస్త్రములు నేలపై పరిచి భయంతో భక్తితో గౌరవంగా ఆహ్వానం పలికినట్లు పేర్కొన్నారు.ప్రభు యొక్క సువార్తను క్రైస్తవులు మోయాలని గుర్తు చేశారు.శాంతి మార్గంలోనే దేవుడు ప్రజలను నడిపించాడని తద్వారా శాంతి,దీనత్వం,వినయంతో యేసు మార్గంలో అందరూ తప్పకుండా నడవాలని క్రీస్తు చెప్పిన మాటలను మంచిగా బోధించారు.ప్రస్తుత కష్టకాల సమయంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ యేసు వైపు చూస్తున్నారని యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదించాలని ప్రమాదాలనుంచి రక్షించాలని ప్రార్థనలు ఎక్కువగా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆ కార్యక్రమంలో సిఎస్ఐ- సెయింట్ పీటర్స్ చర్చి ఆలయ కమిటీ సెక్రటరీ డోలకల డేవిడ్,ఫాస్టరేట్ స్టూవర్టు కుక్క దేవానందం,ట్రెజరర్ శరత్ బాబు,జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ చైర్మన్ కలువల శ్రీనివాస్,కమిటీ సభ్యులు బోడ ప్రభుదయాల్,సిహెచ్.శ్రీనివాస్,స్త్రీల సెక్రటరీ ప్రేమలత,మాజీ కమిటీ సభ్యులు,గ్రూపు లీడర్లు,క్రైస్తవ సోదరీ సోదరులు,యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి