క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే,ఎంపి


 క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే,ఎంపీ

--   చెన్నూరు ఎమ్మెల్యే వివేక్-పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రసంగం... 

--  ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత బ్రిడ్జ్ మూసివేస్తారు 

రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని మంగళవారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరై లాంచనంగా అధికారికంగా



ప్రారంభించారు.ఆ క్రమంలో చూస్తే..ముందుగా రైల్వే బ్రిడ్జి యొక్క శిలాఫలకంను ఆవిష్కరించారు.అనంతరం బ్రిడ్జికి కట్టిన రిబ్బన్ ను కట్ చేసి ఎమ్మెల్యే వివేక్ ఎంపీ వంశీకృష్ణలు ప్రారంభించారు.అనంతరం అక్కడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలో మంచిర్యాల కలెక్టర్ తో కలిసి ఎంపీ,ఎమ్మెల్యే,కలెక్టర్ రామకృష్ణపూర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ముందుగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గెలిచిన తర్వాత వెంటనే బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పిన మాటలను నెరవేర్చి ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.అలాగే రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం నెలకొన్న సమస్యను ఢిల్లీలో సంబంధిత రైల్వే అధికారులు కేంద్ర మంత్రితో కలిసి మాట్లాడి పరిష్కరించి స్థానిక రైల్వే స్టేషన్లో ఆ రైళ్లు నిలుపుదలకు కృషి చేస్తామని తెలిపారు.క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని వివరించారు.అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మార్నింగ్ వాకింగ్ టైంలో ఐదు ఆరుసార్లు ఇక్కడి బ్రిడ్జికి వచ్చినట్లు గుర్తు చేశారు.దాంతో క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ సంబంధిత ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి త్వరగా బ్రిడ్జి యొక్క పెండింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.అలాగే భూమి కోల్పోయిన వాళ్లకు నష్టపరిహరం ఇప్పించినట్లు పేర్కొన్నారు.క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీలు రోడ్ల నిర్మాణం ఇంకా పట్టణ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చినట్లు తెలిపారు.అలాగే కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నట్లు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా యువజన వికాస్ పథకం కింద నిరుద్యోగులకు అందించే సబ్సిడీ లోన్ విషయంలో ఇప్పటివరకు చాలామంది దరఖాస్తు చేసుకున్నట్లు అందరికీ వచ్చేలా కృషి చేస్తామని ఆ వచ్చిన డబ్బులతో యువకులు జల్సాలు చేయకుండా మంచిగా ఉపాధి కనపరచుకొని అభివృద్ధిలో వెళ్లాలని ప్రసంగించారు. అలాగే క్యాతనపల్లి రైల్వే గేటు మూసివేసి ఉన్నప్పుడు స్థానికంగా కొడుకు చనిపోయిన తల్లిదండ్రుల బాధితుల గోడును అక్కడ వేదికపై ఎంపీ ఎమ్మెల్యే విన్నారు.ఆ రైల్వే గేటు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.ముఖ్యంగా క్యాతనపల్లి రైల్వే గేటు పనులన్నీ పూర్తయిన కూడా ఆ బ్రిడ్జిపై విద్యుత్ లైటింగ్ ఇంకా అమర్చలేదని పెండింగ్లో ఉందని తెలిపారు.అందుచేత ప్రతిరోజు సాయంత్రం 6 గంటల సమయం తర్వాత నుంచి ఆ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తామని తెలిపారు.ఆ నేపథ్యంలోనే 15-20 రోజుల్లో గా క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేయడంతో ఆ తర్వాత నుంచి సాయంత్రం వేళ బ్రిడ్జిపై రాకపోకలు ప్రతిరోజు 24 గంటలు ఉంటాయని గుర్తు చేశారు. సాయంత్రం వేళ సమయంలో ఆ బ్రిడ్జిపై ఎవరైనా రాకపోకలు సాగిస్తే పోలీస్ కేసులు పెట్టాలని సిఐను ఎమ్మెల్యే ఆదేశించారు.ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,మంచిర్యాల ఆర్ అండ్ బి అధికారులు,





కాంగ్రెస్ పార్టీ ఆర్కేపీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పిసిసి జనరల్ సెక్రెటరీ పి రఘునాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సమ్మయ్య ఎండి అబ్దుల్ అజీజ్ ఒడ్నాల శ్రీనివాస్,టి.రాంబాబు,సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ రామడుగు లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్లు మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.ఆ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన ప్రజలకు భోజన వసతి కల్పించారు.కాగా క్యాతనపల్లి రైల్వే ప్రారంభోత్సవ ప్రోగ్రాంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ నేతృత్వంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్,






మందమర్రి ఎస్ఐలు ఇద్దరు రాజశేఖర్ లు,పోలీసులు ఉద్యోగరీత్యా గట్టి భద్రత కల్పించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి