మంచిర్యాల ఆసుపత్రిలో డాక్టర్లపై సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి సీరియస్?
మంచిర్యాల ఆసుపత్రిలో డాక్టర్లపై సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి సీరియస్?
--- 9:45 గంటల వరకు కూడా ఓపిలకు రాని డాక్టర్లు
--- క్యూలైన్లతో రోగులు బారులు తీరిన వైనం
--- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..
మంచిర్యాల న్యూస్ ఏప్రిల్-17 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రతిరోజు పేషంట్లను చూసే..ఓపి డాక్టర్లు నిర్ణిత సమయంలో రాకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి సీరియస్ అయ్యారు.ఆ క్రమంలో చూస్తే.. మంచిర్యాల జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు ప్రజలు వాళ్లకు ఏర్పడిన అనారోగ్య సమస్యలపై నిత్యం ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉండడం కనిపించింది.ప్రధానంగా గురువారం కూడా ఆసుపత్రిలోని 40 ఓపివద్ద ఉదయం 8 గంటల నుంచి రోగులు క్యూ లైన్లు కట్టి ఎక్కువ సంఖ్యలో కనిపించారు.అయితే ఉదయం 9:45 గంటల సమయం అవుతున్న కూడా ఒక డాక్టర్ కూడా సంబంధిత ఓపికి రాకపోవడంతో వివిధ సమస్యలతో డాక్టర్ వద్దకు వచ్చి రోగం గురించి చెప్పుకునే ప్రజల సంఖ్య అక్కడ క్యూ లైన్ లో ఎక్కువ సంఖ్యలో కనిపించింది.ఆ సమయంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి ఆయన విధినిర్వహణలో భాగంగా ఆసుపత్రిలో రౌండింగ్ చేస్తూ అక్కడి ఓపికి చేరుకున్నారు.ఆ తరుణంలో ఓపి వద్ద పేషెంట్లు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్న కూడా ఒక్క డాక్టర్ కూడా కనిపించకపోవడం ఆయన చూసారు.దాంతో వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి ఇంత టైం...అవుతున్న కూడా ఒక్క డాక్టర్ కూడా 40 నెంబర్ జనరల్ ఒపీలో లేకపోవడం ఏంటి? అని వెంటనే రావాలని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జర్నలిస్టు తెలుగు దిన పత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ కెమెరాకు కనిపించింది.వెంటనే డాక్టర్లు రావడంతో పాటు పేషంట్లను వాళ్లకి ఏర్పడిన రోగాల సమస్యలపై వైద్య చికిత్సలు నిర్వహించడం కనిపించింది.ముఖ్యంగా డాక్టర్లు ఎనిమిది గంటలకే వచ్చి ఆసుపత్రిలోని వాళ్ల యొక్క ఓపిలలో ఉండాలి అలాగే రోగులకు చికిత్సలు చేయాల్సిన బాధ్యత కూడా ఉందని జర్నలిస్టు పత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ ద్వారా గుర్తు చేస్తున్నాము.
Comments
Post a Comment