విశ్వశాంతి కోసం యేసు క్రీస్తు ప్రభువు చేసిన త్యాగమే గుడ్ ఫ్రైడే
విశ్వశాంతి కోసం యేసు క్రీస్తు ప్రభువు చేసిన త్యాగమే గుడ్ ఫ్రైడే
-- ఆర్కేపీ సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు
-- పాస్టర్ ఎం.జాషువా దైవ సందేశం అందించారు
రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-18 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : విశ్వశాంతి కోసం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప త్యాగ పలితమే గుడ్ ఫ్రైడే-శుభ శుక్రవారంగా చరిత్రలో నిలిచి ఉందని తెలుస్తుంది.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల యూనియన్ బ్యాంక్ ముందుగల సిఎస్ఐ- సెయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే- శుభశుక్రవారం వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో మంచి విశ్వాసంతో ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆ సందర్భంగా చర్చి పాస్టర్ రెవారెండ్ యం.జాషువా దేవుని సందేశంను మంచిగా అందించారు.పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు కల్వరి సిలువలో పలికిన ఆ ఏడు మాటలు - ప్రజలకు అందించిన గొప్ప రక్షణ సందేశం గురించి క్లుప్తంగా వివరించారు.యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన సమయంలో ఆ దేవుని వస్త్రములు తీసివేయడమే గాక యేసు మీద ఉమ్మి వేశారని చొక్కా విప్పేసి అవమానంతో వేధించారని గుర్తు చేశారు.ఆ నేపథ్యంలోనే బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యములు చదివి చక్కగా వినిపించారు.ఆనాడు క్రీస్తు ప్రభువు ప్రజల భారంను తనపై మోసుకొని ఎక్కువ శ్రమలు అనుభవించారని తెలిపారు. ప్రధానంగా యేసు కల్వరి సిలువలో మాట్లాడిన ఏడు ముఖ్యమైన అమూల్యమైన మాటలు గురించి క్లుప్తంగా వివరించారు.ఆ సమయంలో కష్టకాలంలో కూడా ఎవరిని కూడా ఒక్క మాట ఏసుప్రభు ఏమి అనలేదని ఎవరిని కూడా ఒక మాటతో దూషించ లేదన్నారు.యేసుక్రీస్తు ప్రజల విముక్తి కోసమే శ్రమలు అనుభవించారని గుర్తు చేశారు.దాంతో యేసు క్రీస్తు ప్రభువు సిలువపై మాట్లాడిన 7 మాటలను మంచిగా సవివరంగా స్పష్టం చేశారు.దాంట్లో చూస్తే...1.తండ్రి వేరేమి చేయుచున్నారో వీరేరుగనుక వీరిని క్షమించుము.2.నేడు నీవు నాతో కూడా పరధైసులో ఉందువు.3.అమ్మ ఇదిగో నీ కుమారుడు..ఇదిగో నీ తల్లి.4.నాదేవా..నా దేవా..నన్నెందుకు చేయి విడిచితివి.5 నేను దప్పి కొనుచున్నాను.6.సమాప్తమైనది.7.తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే 7 యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన ఆ మాటలను తెలిపారు.ముఖ్యంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో అత్యంత విశ్వాసంతో పూర్తి నమ్మకంతో పెద్ద ఎత్తున జరుపుకుంటారని ప్రకటించారు.ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు దినమంతా తండ్రి దేవుని పరిచర్య జరిపి రాత్రి వేళల్లో మాత్రం ఆయన తండ్రి దేవునికి భూమి మీద మోకరించి ప్రార్థనలు చేసేవారని గుర్తు చేశారు.అలాగే శత్రువులను కూడా ప్రేమించాలని కల్వరి సిలువలో క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు విని అందరూ కూడా యేసు దేవుని ప్రార్థనలు చేశారని క్రీస్తు ప్రభు చివరి క్షణంలో కూడా నమ్మకం,విశ్వాసం,దైర్యంతోనే తండ్రి ఆజ్ఞను నెరవేర్చినాడని ప్రకటించారు.ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా యేసు దేవుని నుంచి అసలు దూరం కావొద్దాని గుర్తు చేశారు.యేసు క్రీస్తు నిజమైన దేవుడు అన్నారు.ఆ దేవుడే నిజంగా మాట్లాడే దేవుడుగా ఉన్నాడని తెలిపారు.ప్రతి మనిషి తన జీవితకాలమంతా కూడా తగ్గింపుతో ఉండాలని వివరించారు.యేసు ప్రేమ,దయగల దేవుడన్నారు.ఆ కల్వరి సిలువ అంటే గొప్ప త్యాగం,సమాధానంగా అభివర్ణించారు.ప్రజల కోసం అందరికోసం ఆయన ప్రాణం త్యాగం చేసినట్లు తెలిపారు.యేసు కోసం ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని ఏసుప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలని తెలిపారు.ఎదుటివారికి వీలైనంతవరకు ఎక్కువగా ప్రేమ,సహాయం చేయాలని- అందించాలని నీతి మాత్రం ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. క్రీస్తు ప్రభువు యొక్క దేవుని ఆశీర్వాదములు పొందాలని తెలిపారు. ఆ సమయంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆలయంలో ప్రార్థన చేస్తున్న క్రైస్తవులందరూ కూడా ఒక్కసారి లేచి నిల్చొని ఉండగా 33 మార్లు గుడి గంటలు మ్రోగించారు. అనంతరం యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమంలో సి ఎస్ ఐ చర్చి పాస్టర్ రెవారెండ్ ఎం.జాషువా, చర్చికమిటీ సెక్రటరీ డొలకల డేవిడ్,ఫాస్టరేట్ స్తూవర్ట్ కే.దేవానందం,ట్రెజరర్ శరత్ కుమార్,అసిస్టెంట్ ట్రెజరర్ ప్రభుదయాల్,జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ చైర్మన్ కలువల శ్రీనివాస్,స్త్రీల సెక్రటరీ సిహెచ్.ప్రేమలత,చర్చి కమిటీ సభ్యులు,మాజీ కమిటీ సభ్యులు,క్రైస్తవ సోదరీ,సోదరులు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment