ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు అలరించాయి



















ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు అలరించాయి 

--  యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు- ముందు మరియాకు దర్శనమిచ్చాడు 

--  క్రీస్తు ప్రభువు మహిళలకు విలువ గౌరవంతో గుర్తించాడు 

--  ముగ్గురు స్త్రీలు ముందుగా యేసు శిష్యులకు యేసు లేచినట్లు వర్తమానం అందించారు 

--  యేసు తిరిగి లేచాడు ప్రజల కోసమే దేవుడు ఉన్నాడు 

--  దైవజనులు-పాస్టర్ ఎం.జాషువా సందేశం - ప్రసంగం....

రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-20,జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ :  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా -సెయింట్ పీటర్స్ చర్చి దైవజనులు- ప్రెస్ బీటర్ ఇన్చార్జ్ రేవరెండ్ ఎం.జాషువా ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్ పండుగ ఆరాధన వేడుకలు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో మంచిగా విశ్వాసం పూర్తిగా నమ్మకంతో ఘనంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు చర్చి దేవాలయానికి చేరుకున్న క్రైస్తవులు మహిళలు క్రైస్తవ కుటుంబాలు ముందుగా యేసు శిలువపై మహిళలు క్యాండిల్స్ వెలిగించి పాటలు పాడుతూ ప్రార్థనలు చేశారు.అనంతరం దేవాలయంలో జరిగిన ఆరాధనలో దైవ సేవకులు రేవారెండ్ ఎం.జాషువా అతి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క దైవ సందేశంను చక్కగా దేవుని ప్రియులు అందరికీ అర్థమయ్యే రీతిలో మంచిగా తెలిపారు.కాగా శుభశుక్రవారం అంటే గుడ్ ఫ్రైడ్ రోజున సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు మూడవ దినమున పునరుత్తానుడై తిరిగి లేచినట్లు స్పష్టం చేశారు.క్రీస్తు ప్రభువు లేచినప్పుడు ముందుగా మగ్దలేని మరియకు కనిపించినట్లు యేసు దేవుడు దర్శనం ఇచ్చినట్లు వెల్లడించారు.ఆ సమయంలో మరియమ్మ వెంటనే వెళ్లి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులైన 11 మందికి క్రీస్తు ప్రభువు లేచినట్లు గొప్ప వర్తమానం అందించినట్లు తెలిపారు.ప్రధానంగా స్త్రీలు అంటే యేసుక్రీస్తు ప్రభువు గౌరవం విలువ ఇవ్వడంతో వాళ్లకు మంచిగా గుర్తించినట్లు తెలిపారు.ఆ నేపథ్యంలోనే మహిళలందరూ - స్త్రీలు ధైర్యంగా ఉంటారని వివరించారు.అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు మరణం నుంచి విజయంగా గెలిచి పునరుత్తానుడై తిరిగి వచ్చినట్లు ప్రచారం చేసింది కూడా స్త్రీలు మాత్రమే అని తెలిపారు. ఆనాటి రోమా ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా చాలా ఎక్కువగా భయపడిన రోజులు అనేకంగా ఉండేవని పేర్కొన్నారు.యేసుక్రీస్తు ప్రభువు ఆనాటి ప్రభుత్వ ముద్ర నుంచి విజయవంతంగా తిరిగి లేచినట్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనతను దేవుని శక్తి బలము తెలుపుతూ గౌరవంగా భక్తిశ్రద్ధలతో జేజేలు తెలుపుతూ కొనియాడారు.దాంతో భూలోకంలోని ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ఆశీర్వాదములు దీవెనలతో రక్షింపబడతారని మరోసారి క్రీస్తు ప్రభువు రెండవ రాక రాబోతుందని ప్రకటించారు.ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క సమాధి తెరవబడటంతో ప్రజలందరూ కూడా ఒక్కసారి సంతోషం ఆనందం చెప్పలేనంతగా వ్యక్తం చేస్తూ నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థనలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు ప్రపంచవ్యాప్తంగా పొందుతున్నారని తెలిపారు.అలాగే దావీదు యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థనలు చేసిన ఆ కష్టకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభువు దేవుడు కాపాడినట్లు తెలిపారు.యేసుక్రీస్తు ప్రభువు ఇష్టంతోనే సురక్షితంగా క్షేమంగా రక్షించినట్లు దావీదు తెలిపినట్లు గుర్తు చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను భారీ ఎత్తున జరుపుకుంటున్నట్లు యేసు తిరిగి లేచినట్లు ప్రపంచానికి ఒక శుభవార్త మానమని వివరించారు.అంతేకాకుండా అందరూ కూడా యేసు తిరిగి లేచినట్లు సంతోషంతో సాక్ష్యం చెప్పాలని తెలిపారు.ఈస్టర్ పండుగ ఆరాధనతో క్రైస్తవులందరికీ కూడా ఒక శుభ దినమని దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని చల్లంగా దీవించబడతారని ప్రార్థించారు.దేవుని ఆలయంలో జరిగిన ఆరాధనలో ఉదయం నుంచి దేవుని స్తుతిస్తూ దేవుని పాటలతో క్రమశిక్షణ నమ్మకంతో ఆరాధిస్తూ క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. 

--  దేవుని పరిచర్య సేవకులు,గ్రూపు లీడర్లకు సత్కారం...

రామకృష్ణాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో గత నలభై రోజులుగా సంబంధిత ఆలయం యొక్క క్రైస్తవులు ప్రతి రోజు అందరు క్రైస్తవుల ఇంటిలో లెంట్ ఆరాధన గృహ కూడికలు ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు భక్తిశ్రద్ధలతో యేసుక్రీస్తు ప్రభువు కోసం ఉపవాసం ఉంటూ కన్నీటి ప్రార్థనలు చేశారు.ఆ గృహ కూడిక లెంట్ ఆరాధనలలో జీవ గ్రంధంలోని బైబిల్ లోని అన్ని అధ్యాయంలోని పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు దేవుని వాక్యములను మంచిగా సందేశంను అందించిన సి ఎస్ ఐ చర్చి పాస్టర్,అమ్మగారు,చర్చి కమిటీ కార్యదర్శి,కమిటీ ఫాస్ట్రేట్ స్టూవర్ట్,గ్రూపు లీడర్లు,దేవుని సేవకులు,సేవకురాలు,దాసులు,దాసురాలు,క్రైస్తవులను ఆ చర్చికి సంబంధించిన జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ ఛానల్ చైర్మన్ కలువల శ్రీనివాస్ కుటుంబం క్రైస్తవ సంఘంలోని అందరినీ కూడా మంచిగా ప్రేమిస్తూ--గౌరవిస్తూ దేవుని పిలుపుమేరకు అందర్నీ కూడా శాలువాతో సత్కరించి ఘనంగా అభిషేకించారు.దాంతో దేవుని క్రైస్తవులు ప్రియులు అందరూ కూడా కలువల శ్రీనివాస్ ఫ్యామిలీ కుటుంబానికి యేసుక్రీస్తు పరిశుద్ధ త్రియేక దేవుని ఆశీర్వాదంలు ఏసుక్రీస్తు ప్రభువు నామములో


వంద శాతం ఉండాలని ఇంకా కృతజ్ఞతలు  తెలిపారు.ఆ కార్యక్రమంలో సీఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా, పాస్టర్ జాషువా కళావతి,చర్చి కమిటీ సెక్రటరీ దొలకల డేవిడ్,ఫాస్ట్రేట్ స్టువర్ట్ కే.దేవానందం,ట్రెజరర్ శరత్ బాబు,అసిస్టెంట్ ట్రెజరర్ బోడ ప్రభు దయాల్,కలువల శ్రీనివాస్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు,చర్చి కమిటీ సభ్యులు బోడ కాంతారాజ్,చిప్పరి శ్రీనివాస్, ఒకటి రెండు మూడు గ్రూపులకు చెందిన లెంట్ నాయకులు-నాయకురాలు కృప,ప్రతాప్,శారద,సువార్త రాణి,క్రైస్తవ సోదరీ,సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి