క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక





క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

--  జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు సాగాలి...

--  అధ్యక్షులు అరందస్వామి,గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్ ప్రసంగం...

రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-22 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీనీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆరంధ స్వామి,ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగారావు,కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి,గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులుగా పిలుమల్ల గట్టయ్య,ప్రచార కార్యదర్శి అరెల్లి గోపికృష్ణ,కార్యనిర్వాహణ అధ్యక్షుడు గంగారపు గౌతమ్ కుమార్,ఉపాధ్యక్షులు మారపల్లి వేణుగోపాల్ రెడ్డి,కొండ శ్రీనివాస్,నాంపల్లి గట్టయ్య,కార్యనిర్వహక కార్యదర్శి పొనగంటి దుర్గా రాజేంద్రప్రసాద్,సహాయ కార్యదర్శులు నెల్లూరి శ్రీనాథ్,పురుషోత్తం గంగులు యాదవ్ లను ఎన్నుకున్నారు.అలాగే ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులుగా దాసరి స్వామి,కొమ్మ సదానందం,దుర్గం వెంకటస్వామి,మాషపత్రి ప్రవీణ్,మోరే రవీందర్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్,అధ్యక్షులు ఆరంద స్వామి మాట్లాడుతూ..ప్రతి వర్కింగ్ జర్నలిస్టు ఐక్యతతో ఉండాలని,ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వ అధికారులు,పోలీసు అధికారులు,ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు,సింగరేణిలోని అన్ని యూనియన్ సంఘాల నాయకులు తప్పకుండా మంచిగా సహకరించాలని తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి