ఆర్కేపిలో ర్రాత్రంతా కరెంటు లేక వర్ణించలేని బాధలు?
ఆర్కేపిలో ర్రాత్రంతా కరెంటు లేక వర్ణించలేని బాధలు?
--- ఉక్కపోత దోమలతో ప్రజలు పరేషాన్ -తీవ్ర ఆగ్రహం
--- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్..
రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-27 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్-క్యాతనపల్లి పట్టణంలో శనివారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు చాలా రకాలుగా వర్ణించలేని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ క్రమంలో చూస్తే..అసలే 45 డిగ్రీల ఉష్ణోగ్రత ముదిరిన ఎండలు కావడం దానికి తోడు రాత్రివేళ సమయంలో ఈదురు గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది.ఆ సమయంలో గాలులు ఎక్కువగా వీచడంతో ముందుగానే సంబంధిత విద్యుత్ ఉద్యోగులు విద్యుత్తు సరఫరాను సైతం ప్రతి ఇంటిలోకి ఇన్కమింగ్ ఆఫ్ చేయడం జరిగింది.అంతేకాకుండా రాత్రివేళ సమయంలో 12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు కూడా విద్యుత్ సరఫరాను ఇవ్వలేదు.దానికి గల కారణాలు చూస్తే..పట్టణంలోని యూనియన్ బ్యాంకు ముందు గల సింగరేణి విద్యుత్ స్తంభం కూలీ గవర్నమెంట్ విద్యుత్ తీగలపై పడింది.అంతేకాకుండా అటు పక్కనే గల డిస్పెన్సరీ ముందు గల ఒక చెట్టు కూలి విద్యుత్తు తీగలపై కూడా పడింది.దాంతో విద్యుత్ స్తంభంతో పాటు ఆ చెట్టు కూడా తీగలపై బలంగాపడి ఉన్నాయి.ఆ తరుణంలో పట్టణంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.అసలే ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ఎడతెరిపి లేకుండా గాలులు వీస్తూ విద్యుత్ అంతరాయం ఏర్పడి కొద్దిపాటి వర్షం కురవడంతో ఆ వేడిని తట్టుకోలేక విద్యుత్తు సరఫరా లేక ఫ్యాన్లు,కూలర్లు,ఏసీలు తిరగకపోవడంతో ఉక్కపోతే భరించకపోవడమే కాకుండా దానికి తోడు దోమలు కూడా ఎగబడి రక్తం త్రాగడానికి దాడి చేయడంతో పట్టణంలోని ప్రజలు చిన్న పెద్ద అందరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.నిజం చెప్పాలంటే రాత్రంతా కూడా నిద్రపోకుండా తెలివితోనే ఉన్నారని చెప్పడంలో అసలు సందేహం లేదు.ప్రధానంగా బ్యాంకు ముందు ఉన్న సింగరేణి విద్యుత్ స్తంభం కూలిపోవడం ఇది రెండవసారిగా జరిగింది.అయితే నెలకు లక్షల రూపాయలు వేతనం పొందే సింగరేణి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్య లేకపోవడం వల్లనే ప్రజలు సింగరేణి కార్మికుల కుటుంబాలు అనేక విధాలుగా రాత్రంతా కూడా ఉపవాసాలు ఉన్నట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సింగరేణి ప్రభుత్వ అధికారులు మేల్కొని విద్యుత్ తీగల వద్ద ఆ చెట్లు నరక వేసే కార్యక్రమంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా ఏలాంటి సమస్యలు తలెత్తకుండా కూలిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముక్తకంఠంతో జర్నలిస్టు తెలుగు దినపత్రిక దృష్టికి తీసుకువచ్చారు.ఆ నేపథ్యంలోనే బ్యాంకు ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి సపోర్టుగా మరొ విద్యుస్తంభమును కూడా ఉద్యోగులు అమర్చారు.దాంతో విద్యుత్ అంతరాయంపై ఏర్పడిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించడానికి సింగరేణి ఉద్యోగులు క్రేన్ సహాయంతో వచ్చి అక్కడి పనులు చకచకా వేగంగా నిర్వహించడం కనిపించింది.ఇకనైనా సింగరేణి ప్రభుత్వ ఉద్యోగులు మేల్కొని విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ గుర్తుచేస్తుంది.ఈ విషయంలో సింగరేణి ప్రభుత్వ సంబంధిత అధికారులు మేల్కొని భవిష్యత్తులో మరోసారి ఈలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని స్థానికులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడం కనిపించింది.
Comments
Post a Comment