భీమా గార్డెన్స్ లో చెన్నూరు ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
భీమా గార్డెన్స్ లో చెన్నూరు ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
-- ముఖ్యఅతిథి చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్
-- డిసిసి అధ్యక్షురాలు సురేఖ,టీపీసీసీ పరిశీలకులు రాఘవరెడ్డి,రాంభూపాల్ ప్రసంగం...
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో గల రామకృష్ణపూర్ లోని భీమా గార్డెన్స్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే డా.వివేక్ వెంకటస్వామి,టీపీసీసీ పరిశీలకులు జంగ రాఘవ రెడ్డి,రాం భూపాల్,డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు హాజరైనారు.ఆ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వేదికపై ప్రసంగించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.900 కోట్ల సిఎం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలకు అందించామన్నారు.చెన్నూరు నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడం.ఆయన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.సింగరేణి సంస్థలో గతంలో లక్ష ఉద్యోగులు ఉండగా కేసీఆర్ హయాంలో 60 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని తీవ్రంగా విమర్శించారు.ప్రస్తుతం 42 వేల ఉద్యోగులు మాత్రమే ఉన్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు.చెన్నూరు అభివృద్ధికి ఏడాదిన్నరలోనే రూ.200 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నట్టు ప్రకటించారు.సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి పేదవాడికి మూడుపూటలు భోజనం తినే అవకాశం కల్పించామని గుర్తు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరథ స్కీములు కేవలం కేసీఆర్ అవినీతి పాలనకు నిదర్శనమని ఆరోపించారు.బీఆర్‌ఎస్ హయాంలో దొడ్డి బియ్యం దందా విచ్చలవిడిగా సాగిందని విమర్శించారు.కేసీఆర్ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు.రాష్ట్రంలో నాణ్యమైన విద్య,వైద్యం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రసంగించారు.ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాని పరిధిని రూ.10 లక్షల వరకు పెంచి పేద ప్రజలకు మరింత బలంగా అండగా నిలిచిందని వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,పిసిసి జనరల్ సెక్రటరీ పి.రఘునాథరెడ్డి,కాంగ్రెస్ పార్టీ స్థానిక ముఖ్య నాయకులు గాండ్ల సమ్మయ్య,అబ్దుల్ అజీజ్,చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గల గ్రామంలోని ముఖ్యమైన నాయకులు యువ నాయకులు మహిళా నాయకురాలు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment