క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూంలు లక్కీ డ్రా తో ఇవ్వడానికి సిద్ధం
క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూంలు లక్కీ డ్రా తో ఇవ్వడానికి సిద్ధం
-- మున్సిపాలిటీ కమిషనర్ రాజు ప్రకటన
-- జర్నలిస్టు డైలీ పేపర్ అండ్ టీవీ న్యూస్....
రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-30 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం ధరఖాస్తు చేసుకున్న విషయంలో లక్కీ డ్రా ద్వారానే ఆ కేటాయింపు జరుగుతుందని బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు ప్రకారం మందమర్రి తహసిల్దార్ కార్యాలయం రెవెన్యూ సిబ్బంది ద్వారా సంబంధిత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపునకు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసినట్లు తెలిపారు.అయితే సిద్దంగా ఉన్న 236 ఇండ్లకు మాత్రమే ప్రస్తుతము “లక్కీ డ్రా” ద్వారా ఎంపిక చేయబడుతుందని 285 అర్హుల యొక్క జాబితాను పురపాలక సంఘ కార్యాలయం క్యాతనపల్లి నోటీసు బోర్డుపై ప్రచురించినట్లు ప్రకటించారు.ఆ జాబితాలో దరఖాస్తుదారుల నుంచి అభ్యంతరాలు స్వీకరించుటకు పురపాలక సంఘ కార్యాలయం క్యాతనపల్లిలో “హెల్ప్ డెస్క్”ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆ జాబితాలో ఎవరికైనను ఎలాంటి అభ్యంతరాలు ఉన్నచో 01.05.2025 నుంచి 07.05.2025 వరకు పురపాలక సంఘ కార్యాలయం తగిన కారణాలతో లిఖిత పూర్వకంగా సమర్పించాలని పేర్కొన్నారు.ఆ అభ్యంతరాల దరఖాస్తులను తహసిల్దార్ ఆఫీసుకు పంపించడం జరుగుతుందని అటుపిమ్మట జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Comments
Post a Comment