ఆర్కేపి ఏరియా ఆస్పత్రిలో సిఎంఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ కు ఘనంగా సత్కారం
ఆర్కేపి ఏరియా ఆస్పత్రిలో సిఎంఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ కు ఘనంగా సత్కారం
--- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వందనం చేసిన సిఎంఓ..
రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : సింగరేణి కాలరీస్ లోని కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రి సిఎంఓగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఆర్.
కిరణ్ రాజ్ కుమార్ కు రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు.ఆ క్రమంలో చూస్తే.. బాధ్యతలు స్వీకరించిన సీఎంఓ రాజకుమార్ ముఖ్య వైద్యాధికారి బెల్లంపల్లి రీజియన్ లోని అన్ని ఆసుపత్రిలలో పర్యటించారు. దాంట్లో భాగంగానే రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఈరోజు సాయంత్రం పర్యటించారు.దాంతో సీఎం ఓ డాక్టర్ రాజకుమార్ కు ఏరియా ఆసుపత్రి ఉద్యోగ సిబ్బంది గౌరవంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కాన్ఫరెన్స్ హాల్లోని ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్లు,ఆసుపత్రి ఉద్యోగ సిబ్బంది శాలువాలు కప్పి పుష్పగుచ్చం సమర్పించి ఆయనకు గౌరవంగా ఉద్యోగ సిబ్బంది సత్కరించారు.ఈ సందర్భంగా సిఏంఓ మాట్లాడుతూ...
సింగరేణి వ్యాప్తంగా ఆసుపత్రులను అభివృద్ధిలో తీసుకెళ్తామని డాక్టర్ల కొరతను కూడా లేకుండా చేస్తామని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించే దిశలో తప్పకుండా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డివై సీఎంవో డాక్టర్ ప్రసన్నకుమార్, ఆసుపత్రి వైద్యులు ఉద్యోగ సిబ్బంది సింగరేణి కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment