సింగరేణిలో 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఎన్ఎస్పిసిఎల్ ఒప్పందం
సింగరేణి నుంచి 5-లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఎన్ఎస్పిసిఎల్ ఒప్పందం
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ మీడియా న్యూస్...
సింగరేణి భవన్,మే 15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక:సింగరేణి సంస్థ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గాపూర్ లో ఉన్న ఎన్ఎస్పిసిఎల్ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది.ఆ క్రమంలో చూస్తే..సింగరేణి ఛైర్మన్-ఎండీ ఎన్.బలరామ్ ఆదేశాలు మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్డీఎం సుభాని సమక్షంలో సింగరేణి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ ఏన్.వి.రాజశేఖర్ రావు,ఎన్ఎస్పిసిఎల్ సీఈవో దివాకర్ కౌశల్,జనరల్ మేనేజర్లు నీల్ కమల్,పలాష్ లు అగ్రిమెంట్ పై సంతకాలు చేసారు.ప్రముఖ జాతీయ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆయన ఎన్టీపీసీ,స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్ కంపెనీ ఎన్ఎస్పిసిఎల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దుర్గాపూర్ వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ బొగ్గును సరఫరా చేయనున్నారు.సింగరేణి సంస్థ నాణ్యత గల బొగ్గును తగిన పరిమాణంలో సకాలంలో అందజేస్తుందని, కనుక తాము ఈ కంపెనీ నుంచి బొగ్గు కొనడానికి ముందుకు వచ్చామని ఎన్ఎస్పిసిఎల్ అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీనివాసరాజు,సురేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment