ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో "మే"డే వేడుకలు-ఆలయ వార్షికోత్సవం




ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో "మే"డే వేడుకలు-ఆలయ వార్షికోత్సవం 

--  పాస్టర్ రెవరెండ్ సిహెచ్.అశోక్ సందేశం 

--  పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా ప్రార్థనలు

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్ మే-1 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) సేయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో గురువారం "మే" డే వేడుకలను క్రైస్తవులు ఐకమత్యంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చాటి చెబుతూ..పెద్ద ఎత్తున నినాదాలు తెలుపుతూ ఆదర్శప్రాయంగా నిర్వహించారు.అలాగే సంబంధిత ఆర్కేపి సిఎస్ఐ చర్చి ఆలయం యొక్క వార్షికోత్సవంను కూడా ఘనంగా నిర్వహించారు.ముందుగా చర్చి ఆలయంలోని మైదానంలో




మేడే సందర్భంగా పతాకంను ముఖ్యఅతిథిగా విచ్చేసిన బెల్లంపల్లి సిఎస్ఐ చర్చ్ ప్రెస్బీటర్ ఇంచార్జ్ సిహెచ్.అశోక్ పతాకమును ఆవిష్కరించారు.అనంతరం క్రైస్తవులను ఉద్దేశించి పాస్టర్ మాట్లాడుతూ..మేడే యొక్క విశిష్టతను క్లుప్తంగా వివరించారు.కాగా మార్తమ్మ అనే క్రైస్తవురాలు పాడిన దేవుని పాట మేడే యొక్క ప్రత్యేకమైన పాటలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించింది.అనంతరం సిఎస్ఐ ఆర్కేపి చర్చి ప్రెస్బీటర్ ఇంచార్జ్ రెవరెండ్ ఎం.జాషువా క్రైస్తవులు,ప్రజలను యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థనలు చేశారు.అనంతరం దేవాలయంలో చేపట్టిన ఆరాధనలో పాస్టర్ రెవరెండ్ సిహెచ్ అశోక్ దేవుని సందేశం అందించారు.యేసు క్రీస్తు యొక్క ఆశీర్వాదములు దేవుని ప్రియులందరికీ ఉండాలని ప్రార్ధనలు చేశారు.ముఖ్యంగా భక్తిశ్రద్ధలతో అత్యంత విశ్వాసం నమ్మకంతో దేవునికి ప్రార్ధనలు చేయాలని తెలిపారు.దాంతో దేవుడు తప్పకుండా ఆశ్చర్య కార్యములు చేస్తారని ప్రకటించారు.ఆ నేపథ్యంలోనే బైబిల్ గ్రంధం- జీవగ్రంథంలోని యేసు దేవుని మాటలు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలా గుర్తు చేశారు.ప్రధానంగా అందరూ దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేయాలని తెలిపారు.అంతేకాకుండా దేవునికి కానుకలు భక్తిశ్రద్ధలతో సమర్పించాలని తెలిపారు.ఈ సమయంలో దేవుని పాటలతో గంభీరమైన ఆరాధన భక్తిశ్రద్ధలతో క్రమశిక్షణగా జరిపించారు.అయితే యేసుక్రీస్తు దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడని అలాగే తప్పు చేసిన వారిని కూడా క్షమిస్తున్నా పరిశుద్ధడైన యేసు దేవుడే ఒక్కరు మాత్రమే అని గొప్ప సందేశం అందించారు.అనంతరం చర్చి పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా మే డే సందర్భంగా అలాగే చర్చి వార్షికోత్సవం పురస్కరించుకొని యేసుక్రీస్తు ప్రభువు కార్మికులను కర్షకులను కష్టజీవులను  క్రైస్తవులను అలాగే ఆలయం యొక్క వ్యవస్థాపకులను అందర్నీ కూడా ఆశీర్వదించాలని ప్రార్ధనలు చేశారు.ఆ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ సిఎస్ఐ చర్చి పాస్టర్ రేవా.ఏం.జాషువా, బెల్లంపల్లి సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రేవా.సిహెచ్.అశోక్ చర్చి కమిటీ సెక్రటరీ డొలకల డేవిడ్,ఫాస్ట్రేట్ స్తూవర్టు కే.దేవానంద్,జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ చైర్మన్ కలువల శ్రీనివాస్,












చర్చి కమిటీ సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు,క్రైస్తవ సోదరీ,సోదరులు,యువకులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి