ఠాగూర్ స్టేడియంలో ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు లాంఛనంగా ప్రారంభం
ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు లాంఛనంగా ప్రారంభం
-- ముఖ్య అతిథులుగా మందమర్రి జిఎం జి.దేవేందర్,డివైపిఎం శ్యాంసుందర్,సిఐ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి కమిషనర్ రాజు,ఎస్ఐ రాజశేఖర్,వసుధ హాస్పిటల్ చైర్మన్ ప్రశాంత్ లు హాజరైనారు
-- ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 24 జట్ల క్రీడాకారులు అత్యంత ఉత్సాహంతో బరిలో నిలిచారు
రామకృష్ణాపూర్ న్యూస్ మే-10 జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి టాగూర్ స్టేడియంలో శనివారం సాయంత్రం ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ ఉమ్మడి అదిలాబాద్ క్రీడా పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.ఆ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులు మందమర్రి జిఎం జి.దేవేందర్,డివైపిఎం శ్యామ్ సుందర్,మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి కమిషనర్ రాజు,ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్,వసుధ హాస్పిటల్ చైర్మన్ ప్రశాంత్ లు హాజరైనారు.దాంతో ముందుగా రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి వాలీబాల్ క్రీడా పోటీలు ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడాకారుల ఉద్దేశించి ముఖ్య అతిథులు అమూల్యమైన సందేశం అందించారు.అలాగే స్వర్గీయ ఈదునూరి రామచందర్,బోయిని రవి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని అలాగే కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు బలి అయిన మృతులకు ఆత్మశాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం వాలీబాల్ పోటీలు ఆడటంతో ఆ క్రీడా పోటీలను పెద్ద ఎత్తున ప్రారంభించారు.ఈ క్రీడా పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 24 జట్ల క్రీడాకారులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ అదనపు ఎస్ఐ లలిత,కోఆర్డినేటర్ శివ,పిఈటిలు దుబ్బ శ్రీనివాస్,బెల్లం శ్రీనివాస్,కుమార్,రంజిత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య,ఒడ్నాల శ్రీనివాస్,సినియర్ క్రీడాకారులు ఈశ్వర చారి,రాజన్న,ఉమ్మడి అదిలాబాదులో జిల్లాలోని 24 జట్లకు సంబంధించిన క్రీడాకారులు,స్థానిక క్రీడాకారులు,యువకులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment