సెక్సువల్ హరాస్మెంట్ ఆక్ట్-లైంగిక వేధింపుల నివారణపై సెమినార్

సెక్సువల్ హరాస్మెంట్ ఆక్ట్-లైంగిక వేధింపుల నివారణపై సెమినార్ 

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక- మీడియా న్యూస్...

మందమర్రి న్యూస్ మే-13 జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ మీడియా న్యూస్ : సింగరేణి కాలరీ 







స్ లోని మందమర్రి ఏరియాలో గల స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో మంగళవారం వర్క్ షాప్ టు క్రియేట్ అవేర్నెస్ సెక్సువల్ హరాస్మెంట్ ఆక్ట్-పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ అనే ప్రోగ్రాంపై సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి జనరల్ మేనేజర్ జి.దేవేందర్ హాజరైనారు.అలాగే బెల్లంపల్లి రీజియన్ లోని శ్రీరాంపూర్ మందమర్రి,బెల్లంపల్లి ఏరియాల నుంచి ఉద్యోగులు హాజరైనారు.ఆ నేపథ్యంలోనే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి తమ సందేశాన్ని అందజేసారు.ఈ సమావేశంలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ వారికి



"పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ అనే అంశంపై"అవగాహన కల్పించడానికి వి.పార్వతీశం(విశాఖపట్నం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్, అడ్వకేట్ ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ వాల్లు విచ్చేసి అనేక అంశాలపై అవగాహన కల్పించారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ..పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురైనట్టయితే సంబంధిత ఇంటర్నల్ కమిటీ మెంబర్లకి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.ఆ సమస్యల పరిష్కారానికి ఈ కమిటీని నిర్ణయించినట్టు తెలిపారు.ప్రధానంగా మహిళా ఉద్యోగులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా సంతోషకరమైన వాతావరణంలో వాళ్ల యొక్క పనులను చేసుకుంటూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ్ ప్రసాద్,వీ.టి.సి మేనేజర్ శంకర్,వీ.టీ.సీ ట్రైనింగ్ అధికారి అశోక్, శ్రీరాంపూర్,మందమర్రి,బెల్లంపల్లి ఏరియాల నుంచి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి