ఆర్టీసీ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా?
ఆర్టీసీ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా?
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్....
హైదరాబాద్ న్యూస్,మే-6, జర్నలిస్టు తెలుగు దినపత్రిక:ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది.ఆ క్రమంలో చూస్తే..మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం అవ్వడంతో సమ్మె వాయిదా పడింది.ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.నవీన్ మిత్తల్,లోకేష్ కుమార్,కృష్ణభాస్కర్‌తో కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారు.ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించనుంది.వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.సమ్మె కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నామని,సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని వెల్లడించింది.ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామని,ప్రైవేటు విద్యుత్ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ప్రభుత్వమే విద్యుత్ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు.కారుణ్య నియామకాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని,సింగరేణి మాదిరిగా రెగ్యులర్ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పామని,విశ్రాంత ఉద్యోగుల బకాయిలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు.వేతన సవరణ గురించి సానుకూలంగా స్పందించారని,ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు.ఈ సమ్మెను కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించామని ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నామని సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రైవేటు విద్యుత్ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.ప్రభుత్వమే విద్యుత్ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు.వేతన సవరణ గురించి సాను కూలంగా స్పందించారు.ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సుదీర్ఘంగా చర్చించారు.తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని ఇటీవల టీజీఎస్‌ఆర్టీసీ ఐకాస నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే మే 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.ఆ నేపథ్యంలోనే సోమవారం భారీ కవాతు సైతం నిర్వహించారు.ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం మే 7న తెల్లవారుజాము నుంచి సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఐకాస చైర్మన్ ఈదురు వెంకన్న,వైస్ ఛైర్మన్ ఎం.థామస్ వెల్లడించిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment