ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో రెండు రోజులు వాలీబాల్ క్రీడా పోటీలు
ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో రెండు రోజులు వాలీబాల్ క్రీడా పోటీలు
- యువత చెడు మార్గంలో కాకుండా క్రీడారంగంలో రాణించాలి...
- ఎస్ఐ జి.రాజశేఖర్,మున్సిపల్ కమిషనర్ జి.రాజు
- వాల్ పోస్టర్లు విడుదల చేసిన క్రీడా పోటీల నిర్వాహకులు
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-
టీవీ మీడియా న్యూస్
రామకృష్ణాపూర్ న్యూస్ మే-7 జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ మీడియా న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 10,11వ తేదీలలో ఆర్ ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆర్ కే పి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమీషనర్ జి.రాజు తెలిపారు.ఆ క్రమంలో చూస్తే...పట్టణంలోని సింగరేణి టాగూర్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ ఇద్దరూ అధికారులు వాలీబాల్ క్రీడ పోటీలకు సంబంధించిన విషయమై మాట్లాడారు.ప్రధానంగా యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా క్రీడా స్ఫూర్తితో మంచిగా క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని తెలిపారు.అయితే పట్టణంలోని పిఇటిలు,సీనియర్ క్రీడాకారుల పర్యవేక్షణలో సంబంధిత వాలీబాల్ క్రీడా పోటీలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.ఆ క్రీడా పోటీల్లో యువత అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనాలని వెల్లడించారు.కాగా రెండు రోజుల పాటు నిర్వహించబడే ఆ పోటీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.అనంతరం వాలీబాల్ క్రీడా పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సమ్మయ్య,సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్,వసుధ హాస్పిటల్ ఛైర్మెన్ ప్రశాంత్,కో-ఆర్డినేటర్ శివ,పిఈటిలు బెల్లం శ్రీనివాస్,కుమార్,రంజిత్,రాజేశం,రవి,రాంమోహన్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment