జర్నలిస్టు తెలుగు దినపత్రిక మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు
-- చైర్మన్-ఎడిటర్ కలువల శ్రీనివాస్
గత 30-సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో నిస్వార్ధంగా నిజాలను ధైర్యంగా దిన పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా టీవీలలో ప్రచురిస్తున్నా-సమాచారంను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నా నాకు అండగా ఉంటున్న స్నేహితులు,అభిమానులు,రాజకీయ నాయకులు,ప్రభుత్వ-సింగరేణి అధికారులు,స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు,మహిళా నాయకురాలు,యువ నాయకులు,విద్యార్థి సంఘం నాయకులు,ప్రజా ప్రతినిధులు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరీ సోదరులు,జర్నలిస్టు డైలీ పేపర్-టీవీ రిపోర్టర్లకు,అన్ని కుల సంఘాల మిత్రులు- సహోదరులకు అందరికీ కూడా పేరుపేరునా ప్రత్యేకమైన వందనంలు -నమస్కారములు తెలుపుతున్నాను.నా యొక్క ముప్పయి యేండ్ల జర్నలిస్టు సేవా సుదీర్ఘ సర్వీసులో అన్ని రకాలుగా చేదు తీపి అనుభవాలను అనేక రూపంలో ఛాలెంజ్ చేస్తూ పట్టుదలతో ఎదుర్కొన్నాను.అయినా కూడా నా నిస్వార్ధమైన సేవే లక్ష్యంగా నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నా దృష్ట్యా ప్రతి సమయంలో ప్రజల యొక్క అందరి ఆదరాభిమానాలు గౌరవం అండదండాలు మీ యొక్క ప్రేమ స్నేహభావంతో పొంది ఉన్నానని మీకందరికీ గౌరవంగా గుర్తు చేస్తున్నాను.ప్రధానంగా జర్నలిస్టు పత్రిక స్థాపించి ఏడాది సంవత్సరం కాలం గడుస్తున్న ఈ శుభ సమయంలో మంచి తరుణంలో అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఆనాడు ఒక పత్రికా రిపోర్టర్గా.. జర్నలిజంలో అడుగుపెట్టిన నేను అనేక విషయాలు అద్భుతాలు మంచి విషయాలు ప్రభుత్వ సమాచారంను ఇంకా మంచి చెడు విషయాలను సింగరేణి సమాచారమును ఇంకా ప్రభుత్వ విషయాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ కష్టకాలంలో అండగా ఉంటూ నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అందరి మన్ననలను గౌరవాన్ని ఇంకా సన్మానాలతో అవార్డులు కూడా పొందిన రోజులు అనేకంగానే ఉన్నాయి.అధికారులు మొదలుకొని ప్రజాప్రతినిధులు పౌరులు అందరి వద్ద నిజమే నా..ఆయుధం అనే నినాదంతో ముందుకు పోతున్న నాకు మీరందిస్తున్న ఆదరాభిమానాలకు తోడ్పాటుకు అలాగే సహకారానికి కూడా థాంక్స్ చెబుతున్నాను.అయితే నాపై మరింత బాధ్యత ఇంకా ఎక్కువ పెరగడంతో నా యొక్క ప్రజానీకం సేవలు కూడా ఇంకా ఎక్కువగానే పెరగాయని చెప్పడంలో అసలు సందేహం లేదు.ముఖ్యంగా న్యాయంపై అన్యాయం గెలవదు అనేది ఎంత నిజమో..ఆ నిజంపై అబద్ధం కూడా గెలవదు అనేది కూడా అంతే వాస్తవమని గుర్తు చేస్తున్నాను.నేను నిజాయితీలో వెళుతుండగా ఎగతాళి చేసిన దుష్టశక్తులు అనేకంగా ఉన్నాయి.అయినా కూడా ఇప్పటికీ కూడా న్యాయం నిజాయితీ నిబద్ధతతో ఒక క్రమశిక్షణ కలిగి ప్రగాఢ విశ్వాసంతో గొప్ప నమ్మకంగా నా బాధ్యతకు వంద శాతం న్యాయం చేస్తున్నాను.అయితే కొందరు అవగాహన లేని వాళ్ళు అనుభవం లేని వాళ్ళు కుట్రదారులు స్వార్ధపరులు అభివృద్ధిని చూసి ఓర్వలేని నమ్మకద్రోహులు నా పేరు చెప్పుకొని లాభపడి ఇప్పటికీ ఉన్నారు.ఇకనుండి వాళ్ళ యొక్క మాటలు అసలు చెల్లవని ఎవరు కూడా ఆ మాయమ్మహారి మాటలు వినవద్దని కోరుతున్నాను.అలాగే నాపై చెడు ప్రచారం చేస్తూ చెప్పే మాటలు కూడా అసలు వినవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.జర్నలిస్టుకు అంకితమైన నేను కలం పెన్ను నమ్ముకొని ప్రజాసేవకు అంకితమై దేవుడు నన్ను ఒక ఆదర్శప్రాయంగా నన్ను నిలబెట్టాడు.నిజాలను బయట పెట్టడానికి నేను వెనకాడే ప్రసక్తే లేదని ధైర్యంగా ముందడుగు వేస్తానని మీకు అందరికీ కూడా తెలుసని నేను నమ్ముతున్నాను.రామకృష్ణాపూర్ అభివృద్ధిలో నా వంతు పాత్ర ధర్మంగా నేను కూడా భాగస్వామిగా ఉండడంతో ముందుకు సాగుతున్నాను.ఆనాటి నుండి ఈనాటి సమయం వరకు మీరందిస్తున్నా ప్రోత్సాహం సహాయ సహకారాలు అండదండలు ఆశీర్వాదాలు ఎప్పటికీ కూడా మునుముందు భవిష్యత్తులో కూడా
ఇలాగే ఉండాలని అందరికీ పేరుపేరునా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
___ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-మీడియా న్యూస్ చైర్మన్
****** కలువల శ్రీనివాస్ *****
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
Comments
Post a Comment