జర్నలిస్టుల ఐక్యత కోసమే క్యాతనపల్లి ప్రెస్ క్లబ్

జర్నలిస్టుల ఐక్యత కోసమే క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ 

గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్ 

రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-20,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండటానికి 2019లో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వపరంగా అధికారికంగా(259 ఆఫ్ 2019)రిజిస్ట్రేషన్ కూడా చేపించినట్లు క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ యొక్క కమిటీ సమావేశం గురువారం సెయింట్ జోసెఫ్స్ స్కూల్లో నిర్వహించారు.ఆ సందర్భంగా కలువల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరిని కూడా ఒకే మార్గంలో అందర్నీ ఐక్యంగా ఉంచాడానికి చాలా రిస్కు తీసుకొని అందర్నీ ఏకం చేయడానికి ప్రెస్ క్లబ్ స్థాపించి క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు.అయితే 30 ఏళ్ల ఆయన జర్నలిస్టు యొక్క సుదీర్ఘ సర్వీసులో ఇప్పటివరకు ఎన్నో నిజాలను వాస్తవాలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారం అందిస్తున్నట్లు గుర్తు చేశారు.ప్రధానంగా క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ తో ఏలాంటి సంబంధం లేని వాళ్ళు అసలు అర్హత కూడా ఉండని వాళ్లు క్లబ్ పేరు చెప్పుకొని కమిటీలు వేస్తున్నట్లు ఆ విషయమై ప్రెస్ క్లబ్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు.రాబోయే కాలంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యాచరణ ఇంకా లీగల్ యాక్షన్ అలాగే మోసం,కుట్రలు,ఓర్వలేనితనం,నమ్మకద్రోహం,స్వార్థంతో చేస్తున్న కొంతమంది వ్యక్తులు రాజకీయ ఎత్తుగడల ప్రవర్తన తీరుపై కూడా తగిన సమాధానం చెబుతామని తీర్మానించినట్లు స్పష్టం చేశారు.ఆ విషయమై న్యాయ సంబంధమైన ఇతర అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు.క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ విషయంలో సమస్యలు సృష్టిస్తున్నా వ్యక్తులు వెంటనే వాళ్ళయొక్క


ప్రవర్తన మార్చుకొని సక్రమంగా ఉండాలని లేనియెడల చట్టపరంగా న్యాయపరంగా అలాగే ప్రింట్ అండ్ మీడియా పత్రికల ద్వారా అసలు నిజా-నిజాలను బయటపెట్టాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా నిజమైన వర్కింగ్ జర్నలిస్టులను తప్పకుండా రాబోయే కాలంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కల్పిస్తామని  తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి