కార్మిక శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు
కార్మిక శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు
- క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ ప్రకటన
రామకృష్ణాపూర్ న్యూస్,జూన్- 22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :ఇటీవల కాలంలో రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం హైదరాబాద్ లో గౌరవంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం-పూల బోకే సమర్పించి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములు అవుతున్నామని ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు.అలాగే పాత్రికేయుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.కార్మిక శాఖ మంత్రిని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆరంద స్వామి,ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగరావు,కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి,ముఖ్య సలహాదారులు కలువల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు పిలుమాళ్ళ గట్టయ్య,ఉపాధ్యక్షులు కొండ శ్రీనివాస్ రెడ్డి,నాంపల్లి గట్టయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగారపు గౌతమ్ కుమార్,ప్రచార కార్యదర్శి అరెల్లి గోపికృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment