గంజాయి,మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన చేపట్టిన ఆర్కేపి పోలీసులు
గంజాయి,మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన చేపట్టిన ఆర్కేపి పోలీసులు
- ఎస్ఐ జి.రాజశేఖర్ ప్రకటన
రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కనకదుర్గ కాలనీ వద్ద(వారంతపు సంత)ఏరియాలో ఆదివారం గంజాయి మత్తు పదార్థం నియంత్రణపై పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఆ సందర్భంగా ఆర్కేపి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ మాట్లాడుతూ..సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనే నినాదంతో గంజాయి-మత్తుపదార్థాల నియంత్రణ కోసం పట్టణ ప్రజలతో పెద్దఎత్తున అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు.అదేవిధంగా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆర్కేపీలో గంజాయి,మత్తుపదార్థాల నియంత్రణ కోసం అనేక విధాలుగా వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ముఖ్యంగా యువతను చైతన్యవoతులను చేయడంతోపాటు గంజాయి ఇతర మత్తుపదార్థాలకు అలవాటుపడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా గంజాయి సేవించేవారు ఇంకా అమ్మే వ్యక్తుల మీద కూడా శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోని పోలీసు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా యువతకు ఎట్టిపరిస్థితుల్లోను డ్రగ్స్,ఇతర మత్తుపదార్థాలకు బానిసలు కాకూడదనీ,తల్లితండ్రులు ప్రతిక్షణం వాళ్ల యొక్క పిల్లలను గమనిస్తూ ఉండాలని అలాగే మంచి-చేడుల కోసం వివరించాలన్నారు.సమాజo గర్వించదగ్గ వ్యక్తులుగా తీర్చిదిద్దాలనీ విజ్ఞప్తి చేసారు.అలాగే ప్రతిమనిషికి ఎన్నో రకాల బాధ్యతలు,హక్కులు ఉన్నాయని వాటిని అనుసరించి ప్రతిఒక్కరు జీవితంలో గొప్పగా స్థిరపడాలని తమ మీద ఆధారపడిన కుటుంబానికి అండగా నిలబడాలని,గంజాయి మత్తుపదార్థాలైన ఆ మహమ్మారికి దూరంగా ఉండాలని,పట్టణంలో గంజాయి,డ్రగ్ ఇతర మత్తుపదార్థాల కోసం సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తప్పకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఆ కార్యక్రమంలో పట్టణ ఎస్సై జి.రాజశేఖర్,హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య,జంగు,బ్లూ కోల్ట్ సిబ్బంది సురేష్,సునీల్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment