క్యాతనపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్

క్యాతనపల్లి-



రామకృష్ణాపూర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్

--- ఓపెన్ జిమ్,క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి మెట్లు ప్రారంభించిన మంత్రి

రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-25,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల 14వ వార్డులో 28 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న సిసి రోడ్,డ్రైనేజ్ పనులకు రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు.అలాగే చిల్డ్రన్ ప్లే,ఓపెన్ జిమ్ లను మంత్రి పెద్ద ఎత్తున ప్రారంభించారు.ఆ నేపథ్యంలోనే











క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద15 లక్షల రూపాయలతో నిధులతో నిర్మించిన మెట్లును కూడా మంత్రి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి పి.రఘునాథ్ రెడ్డి,మాజీ క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ జంగం కల,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అబ్దుల్ అజీజ్,గాండ్ల సమ్మయ్య,ఓడ్నాల శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువ నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు,సంబంధిత శాఖల వివిధ అధికారులు,పోలీసు అధికారులు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి