రాష్ట్రమంత్రి వివేక్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు

కార్మిక శాఖ మంత్రి వివేక్ శ్రద్ధతోనే క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి శ్రీకారం 








బిఆర్ఎస్ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పి.రఘునాథరెడ్డి,ఆర్కేపి పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు

రామకృష్ణాపూర్ న్యూస్,జూన్ 27,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : క్యాతనపల్లి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రెండు రోజుల క్రితం హాజరైన రాష్ట్ర కార్మిక,గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీద ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు గత అసమర్థ ఎమ్మెల్యే నుంచి ఏం పనులు చేయించుకున్నారో తెలుపాలని పిసిసి జనరల్ సెక్రెటరీ పి.రఘునాథరెడ్డి,ఆర్కేపీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ప్రశ్నించారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శుక్రవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడారు.వార్డులలో ఏ పని చేయించాలన్న ఎమ్మెల్యేకు విన్నవించడం గాని అడగటం గానీ చేయకుండా అభివృద్ధి పనులు అసలు ఎలా జరుగుతాయన్నారు.ఐదు సంవత్సరాల కాలంలో శంకుస్థాపనలతో పబ్బం గడిపిన బిఆర్ఎస్ నాయకులు,నిధులను విడుదల చేసి పనులు కంప్లీట్ చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వము,మంత్రి వివేక్ పైన ఓర్వని గుణంతో పనికిరాని ఆరోపణలు చేయడం  సరికాదని గుర్తు చేశారు.క్యాతనపల్లిలో గత సంవత్సరన్నర కాలంలో రోడ్లు డ్రైనేజీలు, క్యాతనపల్లి ఆర్ఓబి పనులు వేగంగా మంత్రి చేయించటం ఏ మాత్రం ఇష్టం లేని బిఆర్ఎస్ నాయకులు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.క్యాతనపల్లి అభివృద్ధిని అడ్డుకోవడానికి చేసే ఏ ప్రయత్నం కూడా ఫలించదని,ఈ సంవత్సరంలో 15 కోట్లతో తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ నిధులతో ప్రజ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని  తెలియచేసారు.అంతేకాకుండా రామకృష్ణాపూర్ పట్టణానికి 5 ఎకరాలలో డంప్ యార్డ్,స్మశాన వాటిక  దానికి అవసరమైన మౌలిక వసతులను మంత్రి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.గత ప్రభుత్వ బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు పనులకు పాతర వేసి శంకుస్థాపనలు చేయించుకొని అధికారం ముగిసిన వెంటనే మేము వార్డులో ఆ పని చేయించాము ఈ పని చేయించామని రోడ్డు ఎక్కి చెప్పుకున్న వార్డులలోని ప్రజలు పట్టించుకోవటం కష్టమని,ఇవన్నీ ఓట్ల కోసం బి ఆర్ఎస్ నాయకులు పడుతున్న పాట్లు మాత్రమే అని ప్రజలకు అర్థమవుతుందని ఎద్దెవా చేశారు.ఇకనైనా అవన్నీ మానుకొని క్యాతనపల్లి అభివృద్ధికి అడ్డు తగలకుండా ఉండటం బి ఆర్ ఎస్ నాయకులకు శ్రేయస్కరమని మున్సిపాలిటీ ప్రజలకు అవసరమైన పనులు,సమస్యల పరిష్కారానికి మంత్రి వివేక్ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని  తెలిపారు.ఆ సమావేశంలో ఆర్కేపీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,టిపిసిసి సెక్రటరీ పి.రఘునాథరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్,సీనియర్ నాయకులు పలిగిరి కనకరాజు,గోపు రాజం,బొద్దుల ప్రేమ్ సాగర్,సురేష్, మారేపల్లి రాజయ్య,సంఘ రవి,నాగుల రాజ్ కుమార్,లెక్కల అనిల్,భాస్కర్,రాంసాయి,నగేష్,బాలకృష్ణ,రవి,ప్రేమ్,తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి