ఆర్కేసిఓఏ క్లబ్ లో మునీర్ మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్
ఆర్కేసిఓఏ క్లబ్ లో మునీర్ మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక -టీవీ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-29,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఆర్కేసిఓఏ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ మునీర్ మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్ పుల్ గా చేపట్టారు.ఆ క్రమంలో చూస్తే...క్యాతనపల్లి మున్సిపల్ రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి కరీంనగర్లోని రెనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,మంచిర్యాలలోని మెడి లైఫ్ సూపర్ స్పెషాలిటీ సహకారంతో వైద్య చికిత్సలు జరిపారు.ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఎస్సై రాజశేఖర్,అతిథులుగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి,సీనియర్ నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు రామ్ శెట్టి నరేందర్,సీనియర్ అడ్వకేట్ సందాని,గాండ్ల సమ్మయ్య,అబ్దుల్ అజీజ్,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,ఏఐటియుసి నాయకులు అక్బర్ అలీ,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్,మెడిలైఫ్ హాస్పిటల్ డాక్టర్ కుమార్ స్వామి,బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు అబ్బాస్,మాజీ ఎంపిటిసిలు పుల్లూరు కళ్యాణ్,గోపు రాజం,మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ హాజరైనారు.దాంతో రిబ్బన్ కట్ చేసి ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించారు.ఆ సందర్భంగా మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఆ వైద్య శిబిరంలో క్యాతనపల్లి మున్సిపల్ ఏరియాలోని ప్రజలు సుమారుగా 1050 వరకు వివిధ పరీక్షలు నిర్వహించుకొన్నారు.ఆ నేపథ్యంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుకున్నారు.ఆ క్యాంపులో రక్త పరీక్షలు,బిపి,ఈసీజీ,టుడి ఈకో పరీక్షలు నిర్వహించారు. అయితే జనరల్ ఫిజీషియన్,చెస్ట్ ఫిజీషియన్,కార్డియాలజీ,న్యూరాలజీ, జనరల్ సర్జన్, ఈ ఎన్ టి, డెర్మటాలజీ,ఆర్థోపెడిక్ లాంటి వివిధ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.ఆ సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహకుడు పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ..మునీర్ అన్న పేరు చిరస్థాయిగా ఉండాలని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజు,ఎస్సై రాజశేఖర్,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,సిపిఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ అజిజ్,టీబిజికేస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ మునీర్ గురించి అతను ప్రజలకు చేసిన సేవలను తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఆ వైద్య శిబిరం ముగిసిన అనంతరం వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, మెడికల్ సిబ్బందికి, సహకరించిన అందరికీ మునీర్ సోదరుడు అడ్వకేట్ సంధాని,స్నేహితుడు యాదిరెడ్డి,అబ్బాస్ చేతుల మీదుగా శాలువాలతో సన్మానించి మెమెంటోలు అందజేశారు.ఆ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది.ఆ శిబిరంలోఒక వెయ్యి 50 మంది క్యాంపుకు హాజరయ్యారు.ఆ కార్యక్రమంలో రెనే హాస్పిటల్ జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్, రామ్ రెడ్డి,
రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment